హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆచార వ్యవహారాలతోపాటు పలు నమ్మకాలను కూడా ఎంతో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ఎలాంటి శుభకార్యాలు లేదా ముఖ్యమైన పనుల సమయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఆ కార్యానికి అశుభంగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఏదైనా శుభ కార్యాలు చేసే సమయంలో, శుక్రవారం, మంగళవారం వంటి రోజులలో నేలపై పసుపు, కుంకుమ పడిపోతే అరిష్టంగా భావిస్తారు. నిజంగానే ఇలా పసుపు ,కుంకుమ పడిపోతే అరిష్టం జరుగుతుందా.. అది అశుభానికి సంకేతమా ? అనే విషయానికి వస్తే..
సాధారణంగా మనం ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు లేదా మంగళవారం, శుక్రవారం వంటి రోజులలో, మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా వారిని మన ఇంటి ఆడ బిడ్డతో సమానంగా భావించి వారికి పసుపు, కుంకుమలను ఇస్తాము. అదేవిధంగా శుభకార్యాలకు వచ్చిన వారికి కూడా పసుపు, కుంకుమ, తాంబూలం వాయనంగా ఇచ్చి పంపిస్తాము. ఈ క్రమంలోని నేలను సాక్షాత్తు భూదేవిగా భావిస్తాము. కనుక భూమాతకు కూడా మనం కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా పూజలు చేస్తుంటాము.
ఈ క్రమంలోనే ఏదైనా ముఖ్యమైన కార్యాలు చేసేటప్పుడు, శుభకార్యాలు చేసేటప్పుడు నేలపై పసుపు, కుంకుమ కింద పడితే మాత్రం కంగారు పడాల్సిన పని లేదని, అది అశుభానికి సంకేతం కాదని పండితులు చెబుతున్నారు. భూదేవి కూడా ఆడబిడ్డతో సమానం కనుక మనం చేసే కార్యంలో తాను భాగమవుతూ తనకి కూడా ఆ కార్యంలో పసుపు, కుంకుమలు ఇవ్వాలని కోరుకున్నప్పుడే ఈ విధంగా భూమిపై పసుపు కుంకుమ కింద పడతాయని, ఇలా పసుపు, కుంకుమ కింద పడితే సాక్షాత్తూ భూదేవికి మనం పసుపు కుంకుమను సమర్పించినట్లని పండితులు చెబుతున్నారు. కనుక ఏదైనా శుభకార్యాల సమయంలో పసుపు, కుంకుమ కింద పడితే ఆందోళన చెందాల్సిన పని లేదని, అది కూడా శుభానికి సంకేతం అని పండితులు తెలియజేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…