సాధారణంగా మనం ఏదైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు ముందుగా ఆ వాహనానికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొత్త వాహనాలను ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ పూజలు చేయించి వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి ముందుగా నిమ్మకాయలను తొక్కిస్తారు. అయితే ఈ విధంగా నిమ్మకాయలను ఎందుకు తొక్కిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి తొక్కించడం పూర్వకాలం నుంచి ఒక ఆచారంగా వస్తోంది. పూర్వకాలంలో ఎడ్లబండ్ల కింద నిమ్మకాయలు పెట్టేవారు. ఏదైనా శుభకార్యాల నిమిత్తం బయలుదేరినప్పుడు లేదా కొత్త వాహనాలను కొనుగోలు చేసినప్పుడు ఈ విధంగా వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి తొక్కిస్తారు. ప్రయాణించే మార్గంలో వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండటం కోసమే ఇలా నిమ్మకాయలను తొక్కిస్తారు.
పూర్వ కాలంలో ఎడ్లబండ్లు మాత్రమే ఉండేవి కనుక ఎంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో ఎడ్ల కాళ్లకు ఏవైనా గాయాలు తగిలితే ఆ గాయాలు మానడం కోసం నిమ్మకాయలను తొక్కించే వారు. నిమ్మకాయ పులుపు ఉండటంవల్ల ఏదైనా ఇన్ఫెక్షన్‌ని తొందరగా తగ్గిస్తుందన్న ఉద్దేశంతో ఎడ్ల బండ్ల కింద నిమ్మకాయలను తొక్కించే వారు. అదే ఆనవాయితీ ఇప్పుడు ఏదైనా వాహనాలను కొనుగోలు చేసినా మొదటగా ఆ వాహనానికి దిష్టి తీసి నిమ్మకాయలను తొక్కిస్తారు. ఇలా చేయడం వల్ల వాహనం ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉంటుందని విశ్వసిస్తారు.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…