మంగ‌ళవారం రోజు ఇలా చేస్తే అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి..!

February 18, 2022 6:37 PM

జీవితం అన్నాక మ‌న‌కు ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వివాహం కావ‌డం లేద‌ని కొంద‌రు బాధ‌ప‌డుతుంటారు. ఇంకా కొంద‌రికి వైవాహిక జీవితంలో స‌మస్య‌లు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కొంద‌రికి వ్యాపారంలో నష్టాలు వ‌స్తుంటాయి. కొంద‌రు ఎన్ని సంవ‌త్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఎదుగు బొదుగు లేకుండా ఒకే స్థానంలో ఉంటారు. ఇక కొంద‌రికైతే ఏ ప‌నిచేసినా క‌ల‌సి రాదు. ఇలా అనేక మందికి ర‌క ర‌కాల స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే వారు మంగ‌ళ‌వారం రోజు హ‌నుమంతుడికి పూజ‌లు చేస్తే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

do this puja on tuesday to remove all problems

7 మంగ‌ళ‌వారాల పాటు హ‌నుమంతున్ని ద‌ర్శించుకోవాలి. ద‌ర్శించిన‌ప్పుడ‌ల్లా 108 సార్లు స్వామి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయాలి. దీంతో అంగార‌క‌, రాహు దోషాలు తొల‌గిపోతాయి. దీని వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు, ఆరోగ్య స‌మ‌స్య‌లు, వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు అన్నీ తొల‌గిపోతాయి. అలాగే ప్ర‌తి మంగ‌ళ‌, శుక్ర‌, శ‌ని వారాల్లో ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల మ‌ధ్య 108 త‌మ‌ల‌పాకుల‌తో పూజ‌లు చేయిస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయి.

సువ‌ర్చ‌లా హ‌నుమ క‌ల్యాణం జ‌రిపించినా స‌మ‌స్త దోషాలు తొల‌గిపోతాయి. నెల నెలా పూర్వాభాద్ర న‌క్ష‌త్రం రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ క‌ల్యాణం జ‌రిపించాల్సి ఉంటుంది. ఆంజ‌నేయ స్వామిని ఆరాధిస్తే స‌క‌ల దేవ‌త‌ల‌ను ఆరాధించిన ఫ‌లితం దక్కుతుంద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. హ‌నుమంతున్ని పూజిస్తే త‌క్ష‌ణ‌మే భ‌క్తుల కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని విశ్వ‌సిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment