ఆధ్యాత్మికం

Budha : మ‌నిషి చ‌నిపోయాక ఎక్క‌డికి వెళ్తాడు అన్న ప్ర‌శ్న‌కు బుద్ధుడు చెప్పిన స‌మాధానం ఇదే..!

Budha : మ‌నిషి చ‌నిపోయాక అత‌నికి ఏమ‌వుతుంది..? అత‌ను ఎటు వెళ్తాడు..? ఈ ప్ర‌శ్న‌ల‌ను గ‌న‌క ఎవ‌రినైనా అడిగితే ఎవ‌రైనా ఏమ‌ని స‌మాధానం చెబుతారు..? ఆ ఏముందీ..! అత‌ని శ‌రీరానికి వారి విశ్వాసాల‌కు అనుగుణంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు. ఇక అత‌ని ఆత్మ స్వ‌ర్గానికో, న‌ర‌కానికో వెళ్తుంది. అంతే క‌దా..! అంటారా..! అయితే సాధార‌ణంగా అంద‌రూ చెప్పే మాట ప్ర‌కారమైతే ఇదే క‌రెక్టే. కానీ దీనికి గౌత‌మ బుద్ధుడు ఏమ‌ని స‌మాధానం చెప్పాడో తెలుసా..?

ఒకానొక సారి గౌత‌మ బుద్ధుడు ఓ చెట్టు కింద కూర్చుని ఉండ‌గా అత‌నికి చెందిన ఓ శిష్యుడు ద‌గ్గ‌రికి వ‌చ్చి పైన చెప్పిన విధంగానే ప్ర‌శ్న‌లు అడుగుతాడు. మనిషి చనిపోయాక ఏమ‌వుతుంది..? అత‌ను ఎటు వెళ‌తాడు..? అని అత‌ను బుద్ధున్ని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే.. నీ చేతికి ఓ బాణం వ‌చ్చి గుచ్చుకుంద‌నుకుందాం. అప్పుడు నువ్వేం చేస్తావు..? బాణం తీసేస్తావా..? లేదంటే అది ఎక్క‌డి నుంచి వ‌చ్చిందా అని వెతుక్కుంటూ దాని దిశ‌గా వెళ‌తావా..? అంటాడు. అందుకు ఆ శిష్యుడు స‌మాధానం చెబుతూ.. ముందు చేతిలో గుచ్చుకున్న బాణం తీసేస్తాను. అనంత‌రం ఆ గాయాన్ని ఎలా మాన్పించాలి అని దారులు వెతుకుతాను.. అని స‌మాధానం చెబుతాడు.

Budha

అప్పుడు బుద్ధుడు అంటాడు.. చూశావా.. మ‌నిషి మ‌ర‌ణించ‌డమ‌నేది త‌రువాతి సంగ‌తి. ముందు అత‌ను త‌న చుట్టూ ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాలి. అంతే.. అంటాడు.. అందుకు శిష్యుడు స‌త్యం బోధప‌డిన‌ట్టు త‌లూపి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. మ‌రో సంద‌ర్భంలో బుద్ధుడు చెట్టు కింద ధ్యానంలో ఉండ‌గా కొంద‌రు పిల్ల‌లు ఆ చెట్టుకు ఉన్న పండ్ల‌ను రాళ్లతో కొట్టి తింటుంటారు. ఈ క్ర‌మంలో ఓ రాయి వ‌చ్చి బుద్ధునికి తాకి ర‌క్తం కారుతుంది. అప్పుడు దాన్ని చూసి ఆ పిల్ల‌లు భ‌య‌ప‌డ‌తారు. అయితే అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే.. చెట్టును రాళ్ల‌తో కొడితే అది మీకు తియ్య‌ని పండ్ల‌ను ఇచ్చింది, కానీ న‌న్ను రాళ్ల‌తో కొడితే నేను ఏమీ ఇవ్వ‌లేక‌పోయాను.. అని బాధ ప‌డ‌తాడ‌ట‌. అదీ బుద్ధుని గుణం.

ఇంకోసారి బుద్ధుడు ప్ర‌వ‌చ‌నాలు చెబుతుండ‌గా ఓ నాట్య‌కారుడు వ‌చ్చి అంటాడు. స్వామీ.. నేను ఈ రాత్రికి నృత్య ప్ర‌ద‌ర్శ‌న చేయాల్సి ఉంది. మీ మాట‌ల వ‌ల్ల అది గుర్తుకు వ‌చ్చింది. అందుకు ధ‌న్య‌వాదాలు అని చెప్పి అక్క‌డి నుంచి వెళ‌తాడు. అప్పుడు ఓ దొంగ వ‌చ్చి అంటాడు.. స్వామీ.. మీరు చెప్పిన విష‌యాల‌లో ప‌డి నేను ఓ దొంగ‌త‌నం చేయాల్సి ఉంటే దాన్ని మ‌రిచిపోయా.. అంటాడు. అనంత‌రం ఇంకో వృద్ధుడు వ‌చ్చి.. అయ్యా.. నేను నా జీవితం మొత్తం విలాస‌వంత‌మైన వ‌స్తువులు కావాల‌ని వాటి వెంట ప‌డ్డాను. కానీ.. మీ మాట‌ల వ‌ల్ల ఇప్పుడు నాకు అనిపిస్తోంది, నేను నా జీవితాన్ని వృథా చేశాన‌ని. ఇంక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌ను. వెంట‌నే నేను మోక్షం పొందేందుకు య‌త్నిస్తా.. అని అక్క‌డి నుంచి వెళ‌తాడు. ఆ త‌రువాత కొంత సేపటికి జ‌నాలంద‌రూ అక్క‌డి నుంచి వెళ్లిపోగా, అప్పుడు బుద్ధుడు త‌న శిష్యుల‌తో అంటాడు. చూశారుగా.. నేను చెప్పిన ప్ర‌వ‌చ‌నాలు ఒక‌టే. కానీ వాటిని ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కంగా అర్థం చేసుకున్నారు. అలాగే మీరు కూడా మీ ఆలోచ‌నా స‌ర‌ళిని విస్త‌రించండి. అన్నీ తెలుస్తాయి అంటాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…

Tuesday, 27 January 2026, 7:39 PM

మెగాస్టార్ చిరంజీవికి చిన్మయి బిగ్ కౌంటర్.. ‘కమిట్‌మెంట్’ అంటే అది కాదు, అబద్ధం చెప్పకండి అంటూ ఫైర్!

70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…

Tuesday, 27 January 2026, 5:49 PM

పది పాసైతే చాలు.. ఆర్‌బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి లింక్ ఇదే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…

Tuesday, 27 January 2026, 2:59 PM

లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…

Tuesday, 27 January 2026, 9:45 AM

మీ ఫోన్ స్లోగా చార్జ్ అవుతుందా? ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!

నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…

Monday, 26 January 2026, 9:44 PM

అమెజాన్ ఉద్యోగులకు షాక్.. రేపటి నుంచి 16 వేల మంది తొలగింపు? భారత్‌పైనే ఆ ప్రభావం ఎక్కువ!

అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…

Monday, 26 January 2026, 7:45 PM

తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే.. 2028లో జాగృతి పార్టీ విజయం ఖాయం: కవిత సంచలన వ్యాఖ్యలు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…

Monday, 26 January 2026, 5:34 PM

మెగా సక్సెస్.. మెగా గిఫ్ట్! దర్శకుడు అనిల్ రావిపూడికి రూ. 1.40 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి!

అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…

Monday, 26 January 2026, 1:38 PM