సమాజంలో జరుగుతున్న దోపిడీలు, అరాచకాల నుంచి ప్రజలను కాపాడాల్సిన పోలీసులే వారి బాధ్యతలు మరిచి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన ప్రజలను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోలీసులు చేస్తున్నటువంటి ఇలాంటి పాడు పనులకు ప్రజలలో పోలీసులపై ఉన్న విశ్వాసం తగ్గిపోతోంది. సమాజం పట్ల బాధ్యత వహించాల్సిన పోలీసులు వాళ్ల బాధ్యత మరిచి దొంగతనానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని విజయ డైరీ సమీపంలో తమిళనాడుకు చెందిన వ్యక్తి పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో వ్యానులో దుస్తుల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి బట్టలను మూట కట్టి పోలీసులు ఉన్నారన్న ధైర్యంతో అక్కడి నుంచి వ్యాపారి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి ఆ మూటలను గమనించిన వ్యాపారి మూటలో బట్టలు తక్కువగా ఉండటాన్ని గమనించాడు. ఈ క్రమంలోనే తన షాపులో దొంగతనం జరిగిందని భావించిన వ్యక్తి అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ చూశాడు.
ఈ వీడియో చూసిన షాపు యజమాని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. తన షాపులో దొంగతనం చేసినది సాదాసీదా వ్యక్తులు కాదు పోలీసులేనన్న విషయం తెలియడంతో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై రాగా ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్ లో ఉండి మరొక వ్యక్తి సివిల్ డ్రెస్ ధరించి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. తన షాప్ లో దొంగతనం చేసింది పోలీసులేనని గుర్తించిన యజమాని ఈ విషయాన్ని జిల్లా పోలీస్ శాఖ అధికారులకు తెలియజేయడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలిసిన ప్రజలు పోలీసులు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…