పెళ్లయిన మూడు నెలలకే.. పరలోకానికి వెళ్లిన నూతన వధువు..!

August 16, 2021 12:26 PM

ఎన్నో ఆశలతో వివాహ బంధం ద్వారా కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తన భర్తతో కలిసి సంతోషంగా జీవించాలని ఎన్నో కలలు కన్న ఆ వధువు కలలు ఆవిరైపోయాయి. పెళ్లయిన మూడు నెలలకే ఆ వధువు తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులకు కడుపుకోతగా మిగిల్చింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఓ తండాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఓ తండాకు చెందిన పీనాబాయి జుక్కల్‌ మండలం దోస్త్‌పల్లి తండాకు చెందిన వీరేశంతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో నవవధువు అత్తారింట్లో అడుగుపెట్టింది.తన కూతురి జీవితం సంతోషంగా సాగిపోతుందనుకున్న క్రమంలో నవవధువు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మరణించిన వార్త తెలియగానే ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.

ఈ క్రమంలోనే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పీనాబాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. తన కూతురుది ఆత్మహత్య కాదని,తను ఆత్మహత్య చేసుకోలేదని అదనపు కట్నం కోసం అత్తింటివారు తనని హత్య చేశారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పీనాబాయి అత్తింటి వారి పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment