రాజస్థాన్‌లోని జోధ్ పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటికి వెళ్లి కొన్ని రోజులు ఉండి వస్తానని అడిగినందుకు ఆగ్రహించిన భర్త తన భార్యను దారుణంగా చిత్రహింసలకు గురి చేశాడు. ఆమె ముక్కు కోసేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్‌లోని జోధ్ పూర్ పరిధిలో ఉన్న లునావస్ అనే గ్రామంలో భూమా రామ్, దేవి (25) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి దేవి తన పుట్టింటికి వెళ్లి వస్తానని తన భర్తను అడుగుతూ వస్తోంది. అందుకు అతను కూడా మొదట అంగీకారం తెలిపాడు. కానీ తాజాగా ఏమైందో తెలియదు కానీ.. తన భార్య పుట్టింటికి వెళ్లి వస్తానని అడిగితే వద్దన్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
ఇద్దరి మధ్య ముందుగా మాటల యుద్ధం జరిగింది. అయితే చివరకు ఆవేశం పట్టలేని భూమా రామ్ తీవ్ర ఆగ్రహంతో కత్తి తీసుకుని తన భార్య ముక్కు కోశాడు. ఈ విషయం గమనించిన ఇరుగు పొరుగు వారు దేవిని హాస్పిటల్‌కు తరలించారు. దేవి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని భూమా రామ్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…