పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కావాలి తారక మహేష్ అనే యువకుడికి హైదరాబాద్ ఎల్బీ నగర్ కి చెందిన ఓ ట్రాన్స్ జెండర్ తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తర్వాత మహేష్ తన సొంతూరులోనే ఉంటూ వారానికి ఒకసారి వచ్చి ఈమెను కలిసి వెళ్లేవాడు. మహేష్ విధంగా ఒక ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్నాడనే విషయం తన ఇంటిలో తెలియడంతో అతని మందలించారు.
తల్లిదండ్రులు మందలించడంతో మహేష్ తన దగ్గరకు రావడం కూడా మానేశాడు. అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా మార్చడంతో తనకు అనుమానం వచ్చి ఏలూరుకి వెళ్ళింది.అక్కడ మహేష్ కుటుంబ సభ్యులు ఆమెను ఎంతో అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానించడమే కాకుండా మహేష్ కూడా తనతో ఏ సంబంధం లేదని చెప్పడంతో మోసపోయానని భావించిన ఆమె ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎల్బీనగర్ పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన మహేష్ ఆమె మరింత కక్ష పెట్టుకొని ఫేక్ ఫేస్ బుక్ క్రియేట్ చేసి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు.ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం తో అసభ్యకర పదజాలంతో పోస్టులు, వీడియోలు పెడితూ ఆమెను విసిగించే వాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలను సేకరించగా ఆ వ్యక్తి మహేష్ అని తెలియగానే దానిపై మరోసారి కేసు నమోదుచేసి అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…