కడుపున పుట్టినబిడ్డ అన్న మమకారం లేకుండా 22 రోజుల పసిగుడ్డుపై ఓ తండ్రి తన పైశాచికత్వాన్ని చూపించాడు. తాగిన మత్తులో తన బిడ్డ, తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆ చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..
సైదాబాద్ పరిధిలోని పూసల బస్తీలో తాగిన మైకంలో రాజేష్ అనే వ్యక్తి తన భార్య జాహ్నవి, 22 రోజుల చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలోనే పసిబిడ్డకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. తన భర్త తాగొచ్చాడన్న కారణంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి చివరికి చిన్నారి ప్రాణాల మీదకు తీసుకువచ్చారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మృతి చెందడంతో పోలీసులు రాజేష్ అలియాస్ రాజును కస్టడీలోకి తీసుకున్నారు. అయితే మృతి చెందిన చిన్నారి వీరికి రెండో సంతానం కాగా మొదటి సంతానం ఒక బాబు పుట్టగా బాబు ఐదు నెలల వయసులో ఉన్నప్పుడు రాజు తాగొచ్చి ఆ బాలుడిని ఇంటి నుంచి బయటకు విసిరాడు. ఈ క్రమంలోనే ఆ బాలుడిని సంరక్షణకోసం యూసఫ్ గూడలోని శిశు విహార్ లో చేర్చారు. కాగా రెండవ సంతానం కూడా ఈ విధంగా వారి మధ్య ఘర్షణలకు బలైపోయాడని స్థానికులు తెలిపారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…