బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరియర్ బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అన్నట్టుగా ఉంది.బాహుబలి సినిమా ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే ప్రభాస్ చేపట్టే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ప్రభాస్ కి సంబంధించి ఏ విషయమైన సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిపోతుంది. తాజాగా ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ సాహో చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన నెటిజన్లు అందరూ రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇదే పోస్టర్ ఫస్ట్ లుక్ గా విడుదల చేసి ఉంటే ఆ సినిమా రేంజ్ మారిపోయేది అంటూ కొందరు కామెంట్లు చేయగా సూపర్ పిక్ అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న సాహో ఫోటో చూసిన మరికొందరు అభిమానులు సాహో సినిమాకు సీక్వెల్ గా సాహో 2 రాబోతుందని త్వరలోనే ఈ విషయాన్ని దర్శకుడు సుజిత్ అధికారికంగా ప్రకటిస్తారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నిజంగానే సాహో 2 వస్తుందా… అంటే ఈ సినిమాకు సీక్వెల్ గురించి ఇప్పుడే విషయం చెప్పలేమని ఇండస్ట్రీ సమాచారం.ఏదిఏమైనా ప్రభాస్ సాహో సినిమాకు సంబంధించిన ఈ పోస్టు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…