బిజినెస్ ఐడియాలు

యూట్యూబ్‌లో చాన‌ల్ క్రియేట్ చేసి నెల‌కు రూ.10 ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చా ?

ఆన్‌లైన్‌లో డ‌బ్బు సంపాదించే మార్గాల్లో యూట్యూబ్ చాన‌ల్ కూడా ఒక‌టి. ఓపిక‌, శ్ర‌మ‌, సాంకేతిక ప‌రిజ్ఞానంపై కొద్దిగా అవ‌గాహ‌న‌. ఉండాలేగానీ ఎవ‌రైనా యూట్యూబ్ చాన‌ల్ క్రియేట్ చేసి చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు. అయితే నెల‌కు రూ.10 ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చా ? అంటే.. చేయ‌వ‌చ్చు.. కానీ అందుకు చాలా క‌ఠినంగా శ్ర‌మించాల్సి ఉంటుంది.

యూట్యూబ్‌లో చాన‌ల్ మొద‌లు పెట్టే ముందు కంటెంట్ ఎంచుకోవాలి. మీకు ఏ రంగంపై ప‌ట్టు ఉందో తెలుసుకోవాలి. డాక్ట‌ర్లు అయితే వారికి వైద్య రంగం గురించి పూర్తి అవ‌గాహ‌న ఉంటుంది క‌నుక వారు ఏ టాపిక్ గురించి అయినా అన‌ర్గ‌ర‌ళంగా మాట్లాడ‌గ‌ల‌రు. అలాగే టైలరింగ్‌, వంట‌లు, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ట్రావెల్‌.. ఇలా భిన్న ర‌కాల కంటెంట్‌ను యూట్యూబ్‌లో వీడియోల రూపంలో పోస్ట్ చేయ‌వ‌చ్చు. కానీ వాటిల్లో మీకు ఏ రంగంలో ప‌ట్టు ఉందో దాన్ని ఎంచుకుని అందులో వీడియోల‌ను రూపొందించాలి. దీంతో త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ మంది స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. చాన‌ల్ వేగంగా పాపుల‌ర్ అవుతుంది.

మీకు న‌చ్చిన టాపిక్‌ను ఎంచుకున్నాక అందులో ట్రెండింగ్ అంశాల‌ను వెద‌కాలి. ఆ టాపిక్‌లో వ్యూయర్స్ ఏ త‌ర‌హా వీడియోల‌ను చూస్తున్నారో ప‌రిశీలించాలి. స‌రిగ్గా అలాంటి వీడియోల‌ను రూపొందించే ప్ర‌య‌త్నం చేయాలి. మొద‌ట 1000 మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు అయ్యే వ‌ర‌కు క‌ష్టంగా ఉంటుంది. కానీ 1000 మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు అయ్యాక చాన‌ల్‌కు వేగంగా స‌బ్‌స్క్రైబ‌ర్లు వ‌స్తారు. దీంతో త‌క్కువ కాలంలోనే చాన‌ల్ పాపుల‌ర్ గా మారుతుంది.

యూట్యూబ్‌లో 1000 మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు, 4000 ప‌బ్లిక్ వాచ్ అవ‌ర్స్ అయితే వీడియోల‌కు యాడ్స్ వ‌స్తాయి. దీంతో ఆదాయం రావ‌డం మొద‌ల‌వుతుంది. అయితే ఒక వీడియోను ఎంత మంది చూస్తున్నారు, ఆ వీడియో చూసేట‌ప్పుడు ఎన్ని యాడ్స్ వ‌స్తున్నాయి ? అనే అంశాల ఆధారంగా రెవెన్యూ వ‌స్తుంది. అంటే ఎక్కువ మంది చూస్తే ఎక్కువ సార్లు యాడ్స్ డిస్‌ప్లే అయ్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి. దీంతో ఆదాయం ఎక్కువ‌గా వ‌స్తుంది. ఇలా యూట్యూబ్‌లో రెవెన్యూ వ‌స్తుంది.

మ‌నం ఏదైనా ప్రొడ‌క్ట్ లేదా స‌ర్వీస్ ప్రారంభిస్తే దానికి ప‌బ్లిసిటీ ఎలా చేస్తామో, యూట్యూబ్‌లో కూడా ప‌బ్లిసిటీ ముఖ్యం. మీ వ‌ద్ద త‌గినంత బ‌డ్జెట్ ఉంద‌ని అనుకుంటే ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ వంటి సోష‌ల్ ప్లాట్‌ఫామ్‌ల‌తోపాటు గూగుల్ యాడ్స్ ద్వారా కూడా యాడ్స్ ఇవ్వ‌వ‌చ్చు. చాన‌ల్ లేదా చాన‌ల్ లో అప్‌లోడ్ చేసే వీడియోల‌ను ప్ర‌మోట్ చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో చాన‌ల్‌ను ప్ర‌మోట్ చేస్తే స‌బ్‌స్క్రైబ‌ర్లు పెరుగుతారు. అదే వీడియోల‌ను ప్ర‌మోట్ చేస్తే వ్యూస్ వ‌స్తాయి. రెండింటినీ ప్ర‌మోట్ చేస్తే రెండూ వ‌స్తాయి. ఇలా చాన‌ల్‌కు ప‌బ్లిసిటీ చేయ‌వ‌చ్చు. దీంతో చాన‌ల్ త్వ‌ర‌గా వృద్ధిలోకి వ‌స్తుంది. త‌గినంత బ‌డ్జెట్ పెట్ట‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. ప‌బ్లిసిటీ అవ‌స‌రం లేదు. అనుకుంటే చాన‌ల్ పాపుల‌ర్ అయ్యేందుకు స‌మ‌యం ప‌డుతుంది.

ఈ విధంగా యూట్యూబ్‌లో చాన‌ల్ క్రియేట్ చేసి ఆదాయం పొంద‌వ‌చ్చు. ఇక నెల‌కు రూ.10 ల‌క్ష‌లు వ‌స్తాయా ? అంటే.. క‌ఠినంగా శ్రమించాలి. ట్రెండింగ్ అంశాల‌కు చెందిన టాపిక్‌ల‌ను ఎంచుకుని వీడియోలు చేయాలి. దీంతో వ్యూస్ వ‌స్తాయి. ఫ‌లితంగా ఎక్కువ మొత్తంలో ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. బాగా పాపుల‌ర్ అవ్వాలే కానీ యూట్యూబ్ చాన‌ల్ ద్వారా నెల‌కు రూ.10 ల‌క్ష‌లు కాదు, ఇంకా అంత‌క‌న్నా ఎక్కువ‌గానే సంపాదించ‌వ‌చ్చు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM