Samantha : విడాకుల అనంతరం పేరు మార్చుకున్న సమంత..?

October 3, 2021 4:14 PM

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన సమంత, నాగ చైతన్య వ్యవహారం విడాకులతో ముగింపు పలికిందని చెప్పవచ్చు. నాగచైతన్యతో పరస్పరం గొడవలు మొదలయ్యాక సమంత తన సోషల్ మీడియా ఖాతాలో సమంత అక్కినేని అని ఉన్న పేరును కాస్తా, అక్కినేని తొలగించి “S” అనే సింగిల్ లెటర్ పెట్టుకుంది. ఇలా సోషల్ మీడియా ఖాతాలలో తన పేరు మారడంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అని, అందుకే సమంత ఇలా అక్కినేని పేరు తొలగించినట్టు వార్తలు పుట్టుకొచ్చాయి.

Samantha : విడాకుల అనంతరం పేరు మార్చుకున్న సమంత..?

ఈక్రమంలోనే అప్పటినుంచి విడాకుల విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొన్ని సందర్భాలలో ఇవన్నీ రూమర్లని కొట్టిపారేసినప్పటికీ శనివారం నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా సమంతతో తన వివాహబంధానికి ముగింపు పలికానని తెలియజేశారు. ఇలా నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితానికి నాగ చైతన్య శుభం కార్డు చెప్పారు.

విడాకులు తీసుకున్న తరువాత సమంత తన సోషల్ మీడియా ఖాతాలలో మరోసారి పేరును మార్చుకుంది. ఈ క్రమంలోనే ఎస్ అని సింగిల్ లెటర్ ఉన్న పేరును తొలగించి సమంత అని పేరున మార్చుకోవడంతో ఈ విషయం  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now