గీత గోవిందం మూవీ స్టైల్‌లో బస్సులో యువతికి ముద్దు పెట్టిన యువకుడు.. వెంటనే బస్సు దిగి పరార్‌.. వేట కొనసాగిస్తున్న పోలీసులు..

September 18, 2021 3:00 PM

సినిమాల్లో చూపించే సన్నివేశాలను కొందరు అనుకరించేందుకు యత్నిస్తుంటారు. అయితే కొన్ని ప్రమాదకరంగా ఉంటే కొన్ని మాత్రం రొమాంటిక్‌ సీన్లు ఉంటాయి. నిజ జీవితంలో వాటిని అనుకరించేందుకు కూడా చాలా మంది యత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు కూడా అలాగే చేశాడు. కాకపోతే అతను ఆ పని చేసినందుకు పోలీసులు అతని వెంట పడుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

గీత గోవిందం మూవీ స్టైల్‌లో బస్సులో యువతికి ముద్దు పెట్టిన యువకుడు.. వెంటనే బస్సు దిగి పరార్‌.. వేట కొనసాగిస్తున్న పోలీసులు..

బెల్లారి నుంచి బెంగళూరుకు ఓ యువతి అక్కడి కేఎస్‌ఆర్‌టీసీ లగ్జరీ బస్సులో ప్రయాణం అయింది. అయితే మార్గ మధ్యలో పీన్యా-జలహల్లి వద్ద బస్సు విరామం కోసం ఆగింది. ఆ సమయంలో ఆ యువతి నిద్ర పోతోంది. అదే అదునుగా భావించిన ఓ యువకుడు ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు.

విషయాన్ని గ్రహించిన ఆ యువతి వెంటనే మేల్కొని బయటకు పరిగెత్తింది. కానీ అప్పటికే ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అతను బస్సు ఎక్కేటప్పుడు ఆ యువతి పక్కనే కూర్చున్నాడు. మార్గ మధ్యలో ప్రయాణంలో అతను తన వైపే తీక్షణంగా చూశాడని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యువకుడి కోసం వేట కొనసాగిస్తున్నారు. బస్సు ప్రయాణించిన రూట్లలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను వారు పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ యువకున్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment