దారుణం.. కుమారుడి ఆగడాలను భరించలేక కన్న కొడుకును హతమార్చిన తండ్రి..!

September 13, 2021 10:36 PM

కొడుకంటే తండ్రికి ఎంతో అనురాగం. తన కొడుకుకి ఏ కష్టం రాకుండా ఎంతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ తండ్రి తాపత్రయ పడుతూ తన కొడుకును గారాబంగా పెంచుకుంటాడు. తన కొడుకు జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటే చూడాలని ప్రతి ఒక్క తండ్రి ఆశపడతాడు. కానీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాల్సిన కొడుకు చెడు వ్యసనాలకు, చెడు తిరుగుళ్లకు అలవాటు పడితే ఏ తండ్రీ ఊరుకోడు. తన కొడుకు ఆగడాలను భరించలేక ఓ తండ్రి కన్న ప్రేమ మమకారాన్ని చంపుకుని కొడుకును హత్య చేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

దారుణం.. కుమారుడి ఆగడాలను భరించలేక కన్న కొడుకును హతమార్చిన తండ్రి..!

పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెంలో రౌడీ షీటర్ అశోక్ దారుణంగా హత్యకు గురయ్యాడు. తన కొడుకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చెడు వ్యసనాలకు, చెడు తిరుగుళ్లకు అలవాటు పడటమే కాకుండా నిత్యం మద్యం సేవించి వచ్చి తన తండ్రితో గొడవ పడేవాడు.

ఈ విధంగా ప్రతి రోజు తన కొడుకు చేస్తున్న చేష్టలను భరించలేక విసిగిపోయిన తండ్రి తన కొడుకుపై కర్ర తీసుకుని దాడి చేశాడు. రాత్రి మద్యం సేవించి వచ్చి గొడవకు దిగిన కొడుకుపై కన్న మమకారాన్ని చంపుకొని కర్రతో తల పై తీవ్రంగా దాడి చేయడంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి అక్కడే పడి ఉన్న కర్రను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment