వినాయక చవితి రోజు నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎంత శుభం కలుగుతుందో తెలుసా ?

September 7, 2021 6:33 PM

హిందువులు జరుపుకునే అనేక పండుగలలో వినాయక చవితి పండుగ ఒకటి. ఈ వినాయక చవితి పండుగను ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. చాలా మంది మట్టి వినాయకుడి విగ్రహాలను తయారు చేసి స్వామివారికి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల చతుర్దశి రోజున వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటారు.

వినాయక చవితి రోజు నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎంత శుభం కలుగుతుందో తెలుసా ?

పురాణాల ప్రకారం వినాయకుడు భాద్రపద శుక్ల చతుర్దశి రోజు విఘ్నేశ్వరుడిగా మారడం వల్ల ఈ రోజున వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు. మరి ఎంతో నియమ నిష్టలతో జరుపుకొనే ఈ రోజు ఏ విధమైన నూనెతో దీపారాధన చేయడం వల్ల శుభ పరిణామాలు కలుగుతాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి వివిధ రకాల పండ్లను, పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అదేవిధంగా వినాయకుడికి దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల స్వామి వారు ప్రీతి చెంది స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి వివిధ రకాల పండ్లు ఆహారపదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తూ వినాయకుడి కథ చదవటం వల్ల స్వామివారి కృప మనపై ఉండి అన్ని శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment