వామ్మో.. నోకియా 3310 ఫోన్‌ను మొత్తం మింగేశాడు.. త‌రువాత ఏమైందంటే ?

September 6, 2021 10:46 AM

ప్ర‌ముఖ ఫోన్ల త‌యారీ కంపెనీ నోకియా 2000వ సంవ‌త్స‌రంలో నోకియా 3310 ఫోన్‌ను విడుద‌ల చేసిన విష‌యం విదితమే. ఈ ఫోన్‌ను అప్ప‌ట్లో బండ ఫోన్ అని కూడా పిలిచేవారు. ఎన్నిసార్లు కింద ప‌డినా పార్ట్‌లను అతికిస్తే మ‌ళ్లీ ప‌నిచేసేది. అందుక‌నే ఈ ఫోన్ అప్ప‌ట్లో చాలా పాపుల‌ర్ అయింది. అయితే ఆ ఫోన్‌ను ఓ వ్య‌క్తి మింగేశాడు.

వామ్మో.. నోకియా 3310 ఫోన్‌ను మొత్తం మింగేశాడు.. త‌రువాత ఏమైందంటే ?

కోసోవో అనే ఐరోపా దేశంలో ఉన్న ప్రిస్టినా అనే ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల వ్య‌క్తి నోకియా 3310 ఫోన్‌ను అమాంతం మింగేశాడు. దీంతో ఆ ఫోన్ అత‌ని పొట్ట‌లో మూడు పార్ట్‌లుగా విడిపోయింది. బ్యాట‌రీ బ‌య‌టకు వ‌చ్చింది. కొన్ని గంట‌ల పాటు ఆ బ్యాట‌రీ అలాగే అత‌ని పొట్ట‌లో ఉంటే పేలిపోయి ఉండేద‌ని వైద్యులు తెలిపారు. కానీ ఆ వ్య‌క్తి ఫోన్‌ను మింగాక వెంట‌నే క‌డుపునొప్పి, వాంతులు అవుతుండ‌డంతో హాస్పిట‌ల్‌కు త‌నంతట తానుగా వ‌చ్చాడు.

ఇక అత‌న్ని ఎక్స్‌రే తీశాక వాటిని చూసి వైద్యులు షాక్ తిన్నారు. అత‌ని జీర్ణాశ‌యంలో ఆ ఫోన్ మూడు భాగాలుగా ఉండ‌డాన్ని గుర్తించారు. వాటిల్లో ఒక‌టి బ్యాట‌రీ. కాగా వెంట‌నే అత‌నికి శ‌స్త్ర చికిత్స చేశారు. మొత్తం 2 గంట‌ల పాటు ఆప‌రేష‌న్ చేసిన వైద్యులు ఎట్ట‌కేల‌కు ఆ ఫోన్ భాగాల‌ను బ‌య‌టకు తీశారు. దీంతో అత‌నికి ప్రాణాపాయం త‌ప్పింది.

అయితే అత‌ను కొంచెం ఆల‌స్యం చేసినా అత‌ని పొట్ట‌లో ఉన్న ఫోన్ బ్యాట‌రీ పేలి ఉండేద‌ని వైద్యులు తెలిపారు. దీంతో అత‌ను చ‌నిపోయి ఉండేవాడ‌ని అన్నారు. అయితే అత‌ను ఫోన్‌ను ఎందుకు మింగాడు ? అన్న వివ‌రాలు తెలియ‌రాలేదు.

కాగా గ‌తంలోనూ ఇలాంటి సంఘ‌ట‌న‌లే ప‌లు మార్లు జ‌రిగాయి. 2014లో కొంద‌రు ఈ విధంగానే ఫోన్ల‌ను మింగారు. 2016లో ఓ 29 ఏళ్ల వ్యక్తి ఇలాగే ఫోన్‌ను మింగ‌గా శ‌స్త్ర చికిత్స చేసి ఫోన్ ను బ‌య‌ట‌కు తీశారు. ఈ విధంగా ఫోన్ల‌ను మింగ‌డం వెనుక మాన‌సిక అనారోగ్య కార‌ణాలు ఉండి ఉంటాయ‌ని వైద్యులు భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment