అత్తా కోడళ్ళ మధ్య చిచ్చుపెట్టిన సెల్ ఫోన్.. బలైన నిండు ప్రాణాలు!

August 31, 2021 11:03 PM

సెల్ ఫోన్ అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెట్టింది. ఈ క్రమంలోనే రెండు నిండు ప్రాణాలు బలి అయిపోయాయి. అత్త అరిచిందన్న కోపంతో తీవ్ర మనస్తాపం చెందిన కోడలు తన కూతురితో సహా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌ లోని ఛత్తర్‌పూర్‌ లో ఉన్న పర్వా గ్రామంలో చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

పనిలేని సమయంలో కోడలు సెల్ ఫోన్ చేతిలో పట్టుకుందని అత్త కోప్పడటంతో తీవ్ర మనస్థాపం చెందిన కోడలు పశువులను తీసుకొని మేపడం కోసం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. ఈ క్రమంలోని దారిలో ఏవైనా బావులు కనిపిస్తున్నాయోనని చూసుకుంటూ వెళ్లిన కోడలికి మార్గమధ్యంలో ఒక బావి కనిపించడంతో తన పిల్లలిద్దరినీ బావిలోకి తోసి తను అక్కడే ఉరేసుకుని చనిపోయింది.

ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే వారిలో  బావిలో పడిన రెండేళ్ల చిన్నారి ఇటుకల మధ్య ఇరుక్కొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు చిన్నారిని రక్షించి సరైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా మరొక కూతురు, ఆ మహిళ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అత్తా కోడళ్ళ మధ్య సెల్ ఫోన్ కారణంగానే గొడవ తలెత్తిందని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment