దారుణం.. చికెన్ ఫ్రై సరిగ్గా వండలేదని భార్యను చంపిన భర్త..

August 25, 2021 7:35 PM

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సర్వసాధారణమే. అయితే ఈ మనస్పర్ధలు కారణంగా మాట మాట పెరిగి వారి మధ్య గొడవ తారస్థాయికి చేరుకొని క్షణికావేశంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా ఓ భర్త తన భార్య చికెన్ ఫ్రై సరిగ్గా వండలేదని ఆమెతో గొడవపడి ఆవేశంలో తన భార్యను చంపాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త పాషా, షిరిన్ భాను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా పాషా బెడ్స్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక రోజు షిరిన్ చెల్లెలు తన ఇంటికి రావడంతో పాషా వెళ్లి చికెన్ తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే తన భార్య చికెన్ ఫ్రై చేసింది. అయితే చికెన్ సరిగ్గా చేయలేదని షిరిన్ భానుపై పాషా కోప్పడ్డాడు. ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది.

అయితే తన ఇంట్లో తన మరదలు ఉండటం చేత ఆ గొడవ అక్కడితో ఆగిపోయినప్పటికే తన మరదలు వెళ్లగానే తిరిగి ఒక రోజు ఇదే గొడవ వారి మధ్య చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పాషా తన భార్యపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పక్కనే ఉన్న కర్ర తీసుకుని తన భార్య తలపై బాదడంతో షిరిన్ భాను అధిక రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతూ తీవ్రగాయాలకు గురై ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు కోల్పోయిన తన భార్య మృతదేహాన్ని తీసుకుని చిక్కబనవర లేక్‌లో పడేశాడు. తన భార్య మిస్సింగ్ అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటనపై పోలీసులకు అనుమానం రావడం వల్ల పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయట పెట్టాడు. ఈ క్రమంలోనే పోలీసులు చిక్కబనవర లేక్‌లో షిరిన్ భాను మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment