మ‌ర‌ణంలోనూ ఈ బంధం వీడలేనిది.. మృతి చెందిన సోద‌రుడికి చివ‌రిసారి రాఖీలు క‌ట్టి వీడ్కోలు ప‌లికిన సోద‌రిలు..!

August 23, 2021 2:05 PM

రాఖీ పండుగ సంద‌ర్బంగా ప్ర‌తి సోద‌రి త‌న సోద‌రుడికి రాఖీ క‌డుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ పండుగ‌ను చాలా మంది జ‌రుపుకుంటారు. ఆదివారం అలాగే చాలా మంది సోద‌రిలు త‌మ సోద‌రుల‌కు రాఖీలు క‌ట్టారు. ఆ విధంగానే ఆ 5 మంది కూడా త‌మ సోద‌రుడికి రాఖీలు క‌ట్టేందుకు వ‌చ్చారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ అత‌ను చ‌నిపోయాడు. అయిన‌ప్ప‌టి వారు త‌మ సోద‌రుడి మృత‌దేహం చేయికి రాఖీలు క‌ట్టారు. ఈ సంఘ‌ట‌న న‌ల్గొండ‌లో చోటు చేసుకుంది.

మ‌ర‌ణంలోనూ ఈ బంధం వీడలేనిది.. మృతి చెందిన సోద‌రుడికి చివ‌రిసారి రాఖీలు క‌ట్టి వీడ్కోలు ప‌లికిన సోద‌రిలు..!

న‌ల్గొండ జిల్లాలోని ఇందుగుల గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో ఉన్న మాల‌గూడెం అనే గ్రామంలో చింత‌ప‌ల్లి ల‌క్ష్మ‌య్య అనే వ్య‌క్తి నివ‌సిస్తున్నాడు. అత‌నికి 59 ఏళ్లు. ప్ర‌తి ఏటా అత‌ని 5 మంది సోద‌రిలు అత‌ని ఇంటికి వ‌చ్చి రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్బంగా రాఖీలు క‌డుతుంటారు. అలాగే ఈసారి కూడా రాఖీలు క‌ట్టేందుకు వ‌చ్చారు.

అయితే ఆదివారం అత‌ను అనుకోకుండా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై చ‌నిపోయాడు. దీంతో అత‌ని సోద‌రిలు తీవ్రంగా దుఃఖించారు. అయినా స‌రే త‌మ సోద‌రుడి మృతదేహం చేయికి వారు రాఖీలు క‌ట్టారు. ఎర్ర ల‌క్ష్మ‌మ్మ‌, నామా ప‌ద్మ‌, అల్ల‌పూరి వెంక‌ట‌మ్మ‌, క‌దిరి కోట‌మ్మ‌, జ‌క్కి క‌విత అనే మ‌హిళ‌లు త‌మ సోద‌రుడికి రాఖీలు క‌ట్టారు. ఆ దృశ్యం అంద‌రినీ కంట త‌డి పెట్టించింది. త‌మ సోద‌రుడికి చివ‌రి సారిగా రాఖీలు క‌ట్టి వారు వీడ్కోలు ప‌లికారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment