భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

January 15, 2026 9:13 PM

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. మొత్తం 7 విభాగాల్లో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు గాను ఒకే నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. BELలో ఖాళీగా ఉన్న ట్రెయినీ ఇంజినీర్‌, జూనియ‌ర్ అసిస్టెంట్‌, సీనియ‌ర్ అసిస్టెంట్ ఆఫీస‌ర్‌, ప్రాజెక్ట్ ఇంజినీర్‌, సీనియ‌ర్ అసిస్టెంట్ ఆఫీస‌ర త‌దిత‌ర పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 192 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ట్లు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన ఉద్యోగాల‌ను చేయాల‌ని చూస్తున్న వారికి ఇదొక గొప్ప అవ‌కాశ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

BELలో మొత్తం 7 ట్రెయినీ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉండ‌గా ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఫిబ్ర‌వ‌రి 27 వ‌ర‌కు గ‌డువు ఉంది. జూనియ‌ర్ అసిస్టెంట్ (హెచ్ఆర్‌) పోస్టులు 12 ఖాళీ ఉండ‌గా వీటికి ఫిబ్ర‌వ‌రి 25 వ‌ర‌కు అప్లై చేయ‌వ‌చ్చు. సీనియ‌ర్ అసిస్టెంట్ ఆషీస‌ర్ (అఫిషియ‌ల్ లాంగ్వేజ్‌) పోస్టులు 5 ఉండ‌గా చివ‌రి తేదీ ఫిబ్ర‌వ‌రి 26. ట్రెయినీ ఇంజినీర్-1 మ‌రియు ప్రాజెక్ట్ ఇంజినీర్‌-1 పోస్టులు 70 వ‌ర‌కు ఉండ‌గా చివ‌రి తేదీ ఫిబ్ర‌వ‌రి 25. సీనియ‌ర్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఇ-1) పోస్టులు 8 ఖాళీ ఉండ‌గా చివ‌రి తేదీ ఫిబ్ర‌వ‌రి 26. జూనియ‌ర్ అసిస్టెంట్ (హెచ్చార్‌) పోస్టు 1 ఉండ‌గా చివ‌రి తేదీ ఫిబ్ర‌వ‌రి 22. డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు 22 ఉండ‌గా చివ‌రి తేదీ ఫిబ్ర‌వ‌రి 24.

BEL Bharat Electronics Recruitment 2025 full details are here

కోట్‌ద్వార్‌, ఘ‌జియాబాద్‌, పంచ్‌కుల‌, బెంగ‌ళూరు, పూణె, న‌వీ ముంబై, మ‌చిలీప‌ట్నం, ఎస్‌బీయూ ప్రాంతాల్లో ఉన్న BEL ప‌రిశ్ర‌మ‌ల్లో ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన వారు ప‌నిచేయాల్సి ఉంటుంది. విద్యార్హ‌త‌, వేత‌నం, ఇత‌ర వివ‌రాల‌ను నోటిఫికేష‌న్‌ను చూసి తెలుసుకోవ‌చ్చు. ఇందుకు గాను అభ్య‌ర్థులు https://bel-india.in/job-notifications/ అనే సైట్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు గాను ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now