Doctor Prescription : ఈ డాక్ట‌ర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్ష‌న్ ను మీరు చ‌ద‌వ‌గ‌లిగితే మీరు మ‌హా మేథావులు అన్న‌ట్లే..!

January 15, 2026 9:13 PM

Doctor Prescription : కింద ఇచ్చిన ఫోటోను ఇప్ప‌టికే మీరు చూసి ఉంటారు. ఇది ఏదో చిన్న పిల్లాడు రాసిన గీత‌లు కావు. ఒక డాక్ట‌ర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్ష‌న్‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. డాక్ట‌ర్లు మ‌న‌కు అర్థం కాని విధంగా స‌హ‌జంగానే ప్రిస్క్రిప్ష‌న్ రాస్తుంటారు. ఆ ప్రిస్క్రిప్ష‌న్ కేవ‌లం మెడిక‌ల్ షాపు వాళ్ల‌కు మాత్ర‌మే అర్థ‌మ‌వుతుంది. అంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ మ‌రీ ప్రిస్క్రిప్ష‌న్ ఈవిధంగా ఉంటే ఎలా చెప్పండి. మెడిక‌ల్ షాపు వాళ్ల‌కు కూడా అర్థం కాలేదు. అవును, ఆ డాక్ట‌ర్ రాసిన ప్రిస్క్రిప్ష‌న్ ను తాము చ‌ద‌వ‌లేక‌పోయామ‌ని మెడిక‌ల్ షాపు వాళ్లు కూడా చేతులెత్తేశారు. ఇంత‌కీ ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింది అంటే..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని స‌త్నా జిల్లాలో ఉన్న నాగౌడ్ క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌లో ఓ రోగికి అక్క‌డి ప్ర‌భుత్వ డాక్ట‌ర్ అమిత్ సోనీ కొన్ని మందుల‌ను వాడాల‌ని చెప్పి ఒక ప్రిస్క్రిప్ష‌న్ ను రాసి ఇచ్చాడు. దీంతో అత‌ను ఆ చిట్టీని ప‌క్క‌నే ఉన్న మెడిక‌ల్ స్టోర్‌లో చూపించాడు. అయితే ఆ డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ ను చూసిన మెడిక‌ల్ షాపు వాళ్లు ఖంగు తిన్నారు. ఆ ప్రిస్క్రిప్ష‌న్ లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేద‌ని వారు చెప్పారు. దీంతో అవాక్క‌వ‌డం రోగి వంతైంది. డాక్ట‌ర్లు రాసే ప్రిస్క్రిప్ష‌న్ స‌హ‌జంగానే అర్థం కాదు. కానీ మ‌రీ మెడిక‌ల్ షాపు వాళ్ల‌కు కూడా అర్థం కాని విధంగా ఆ డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ రాశాడు. దీంతో అత‌నిపై ఫిర్యాదు చేశారు.

madhya pradesh Doctor Prescription viral on social media
Doctor Prescription

ఇక ఈ సంఘ‌ట‌న‌పై స‌ద‌రు జిల్లా హాస్పిట‌ల్ చీఫ్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్ ఎల్‌కే తివారీ మాట్లాడుతూ.. ఈ విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. వెంట‌నే డాక్ట‌ర్ అమిత్ సోనీకి నోటీసులు జారీ చేశామ‌ని, అత‌ని నుంచి స‌మాధానం రాగానే త‌గిన చర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఇక అమిత్ సోనీ రాసిన ప్రిస్క్రిప్ష‌న్ ను తాము కూడా చ‌ద‌వ‌లేక‌పోయామ‌ని తివారీ చెప్ప‌డం విశేషం. ఏది ఏమైనా ఆ డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దాన్ని మీరు కూడా ఒక‌సారి చూడండి. అర్థం అయితే చెప్పండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now