Banana Tree In Home : వాస్తు ప్ర‌కారం అస‌లు ఇంట్లో అర‌టి చెట్టును పెంచ‌వ‌చ్చా.. పెంచితే ఏం జ‌రుగుతుంది..?

April 17, 2024 11:41 AM

Banana Tree In Home : పూర్వ‌పు రోజుల్లో పెర‌ట్లో అర‌టి చెట్ల‌ను ఎక్కువ‌గా నాటేవారు. ఎంతో జాగ్ర‌త్త‌గా పెంచేవారు. అర‌టి చెట్టులోని ప్ర‌తిభాగం ఎంతో ఉప‌యోగ‌క‌రం. వాటి ఆకుల‌ను ఆహారం వ‌డ్డించ‌డానికి ఉప‌యోగించేవారు. అయితే ఇప్ప‌టి వారు ఈ చెట్టును ఎక్కువ‌గా పెంచ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేదు. కొంత‌మంది ఉద‌యాన్నే లేవ‌గానే ఈ చెట్టును చూడ‌డం అశుభం అనుకుంటారు. దాని కార‌ణంగా చెట్టును పెంచ‌రు. అయితే జ్యోతిష్య‌శాస్త్ర నిపుణులు ఈ అర‌టి మొక్క‌ను పెర‌ట్లో పెంచ‌డం శుభ‌మే అంటున్నారు. అర‌టి చెట్టును ఈశాన్య దిక్కులో నాటడం ఉత్త‌మం.

ఇలా నాట‌డం వ‌ల‌న మ‌న ఇంట్లో సుఖ‌సంప‌ద‌లు క‌లుగుతాయి. అలాగే ఈ చెట్టులో నారాయ‌ణుడు కొలువై వుంటాడ‌ని న‌మ్మ‌కం. తుల‌సి చెట్టును ల‌క్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే అర‌టి చెట్టు కింద తుల‌సి చెట్టును నాటాలి. అప్పుడు ఇద్ద‌రి ఆశీస్సులు ద‌క్కుతాయి. ప్ర‌తి గురువారం చెట్టును ప‌సుపు కుంకుమ‌తో పూజించి దీపం వెలిగించాలి. అలా చేయ‌డం వ‌ల‌న గృహంలో సుఖ‌సంప‌ద‌లు క‌లుగుతాయి. అర‌టి చెట్టును ఎప్పుడైననా ఇంటి వెనుక భాగంలో నాటాలి. ఇంటి ముందు భాగంలో నాట‌కూడ‌దు.

Banana Tree In Home can we grow it according to vastu
Banana Tree In Home

అది అశుభం. అర‌టి చెట్టును త‌ప్పుగా నాటినా, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోయినా ఇంట్లో అశుభాలు జ‌రుగుతాయి. చెట్టు చుట్టూ శుభ్రంగా వుంచాలి. ప్ర‌తిరోజు నీళ్ల‌ను పోయాలి. ఈ చెట్టుకు బ‌ట్ట‌లు, గిన్నెలు క‌డిగిన, మిగిలిన నీటిని పోయ‌కూడ‌దు. అలా చేయ‌డం అశుభం. అంతేకాదు,ఆకులు ఎండిపోతే వెంట‌నే తీసివేయాలి. అలాగే ఈ చెట్టుకు జ్యోతిష్యంలో మంచి స్థానం వుంది. ఈ చెట్టు శుభానికి సంకేతం అంటున్నారు వాస్తు పండితులు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now