Kalasha Sthapana : క‌ల‌శ స్థాప‌న అనంతరం అందులో జ‌రిగే అద్భుత‌మైన మార్పు ఇదే.. మీకు ఇలా జరిగిందా..?

April 12, 2024 8:14 AM

Kalasha Sthapana : చైత్ర న‌వ‌రాత్రులు ఏప్రిల్ 9 నుండి ప్రారంభ‌మ‌య్యాయి. మొద‌టి రోజు ఘ‌ట‌స్థాప‌న‌తో పాటు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు. న‌వ‌రాత్రుల మొద‌టి రోజు చేసే క‌ల‌శ స్థాప‌న‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంది. క‌ల‌శ స్థాప‌న‌కు ఉప‌యోగించిన కొబ్బ‌రికాయ‌ను న‌వ‌రాత్రి చివ‌రి రోజున తొల‌గించి భ‌ద్రంగా ఉంచుతారు. దీనిని శుభ‌కార్యాల్లో ఉప‌యోగిస్తూ ఉంటారు. హిందూ ధ‌ర్మాల ప్ర‌కారం కొబ్బ‌రికాయ‌ను శ్రీహ‌రి, ల‌క్ష్మీ స్వ‌రూపంగా భావిస్తారు. కొబ్బ‌రికాయ లేకుండా చేసే పూజ అసంపూర్ణ‌మైన‌ది. న‌వ‌రాత్రుల్లో ఘ‌ట‌స్థాప‌న చేసే ఎవ‌రైనా కొబ్బ‌రికాయ‌ను ఉప‌యోగించాల్సిందే. అయితే కొన్నిసార్లు మ‌నం క‌ల‌శంలో ఉంచిన కొబ్బ‌రికాయ‌లో మొక్క పెరుగుతూ ఉంటుంది.

ఇలా మొక్క పెరిగే కొబ్బ‌రికాయ మ‌న‌కు దేనిని సూచిస్తుంది… ఇది మంచిదా..? కాదా..? ఇది ఎటువంటి ఫ‌లితాలు క‌లిగిస్తుంది..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. న‌వ‌రాత్రి స‌మ‌యంలో క‌ల‌శంలో ఉంచిన కొబ్బ‌రికాయ‌లో చెట్టు పెరిగితే దీనిని శుభ సంకేతంగా ప‌రిగ‌ణించాలి. అక్క‌డ ఉండే వాతావ‌ర‌ణం కూడా సానుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం కూడా మ‌న‌కు క‌లిసి వ‌స్తుంది. కొబ్బ‌రికాయ‌లో పెరిగే ఈ మొక్క మ‌న ప్ర‌గ‌తిని సూచిస్తుంది. హిందూ ధ‌ర్మాల ప్రకారం విష్ణువు మ‌రియు లక్ష్మీ దేవి కొబ్బ‌రి చెట్టును భూమిపైకి తీసుకువ‌చ్చారని న‌మ్ముతారు. కొబ్బ‌రి చెట్టును క‌ల్ప‌వృక్షం అని కూడా అంటారు. మ‌నం పూజ‌లో ఉప‌యోగించిన కొబ్బ‌రికాయ‌లో క‌నుక చెట్టు ఉంటే మ‌న‌కు విష్ణువు యొక్క ఆశ్వీరాదం ల‌భించింద‌ని దాని అర్థం.

Kalasha Sthapana what happens when you do it in coconut
Kalasha Sthapana

అలాగే ల‌క్ష్మీదేవి కూడా కొబ్బ‌రికాయ‌లో నివసిస్తుంద‌ని న‌మ్ముతారు. న‌వ‌రాత్రి స‌మ‌యంలో ప్ర‌తిష్టించిన కొబ్బ‌రికాయ‌లో చెట్టు ఉంటే మ‌న‌పై లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉన్న‌ట్టే. అలాగే ఆర్థిక సంక్షోభం నుండి బ‌య‌ట‌ప‌డ‌డంతో పాటు ఆర్థికస్థితి కూడా మెరుగుప‌డుతుందని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now