Afternoon Nap In Office : మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తోందా..? ఇలా చేస్తే అస్సలు నిద్ర రాదు..!

January 3, 2024 8:26 PM

Afternoon Nap In Office : చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. పని మీద ఫోకస్ పెట్టలేకపోతూ ఉంటారు. విద్యార్థులు, ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు, ఏదైనా పని చేసే వారికి మధ్యాహ్నం పూట తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుందంటే, దాన్ని ఆపడం కష్టమే. ఒళ్లంతా కూడా బద్దకంగా ఉంటుంది. వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతుంటారు. అలా మీకు కూడా, ఇబ్బంది వుందా..? నిద్రమత్తుని పోగొట్టుకోవాలంటే, కొన్ని చిట్కాలు ని పాటించడం మంచిది. ఇలా చేశారంటే, మధ్యాహ్నం పూట మీకు నిద్ర రాదు.

ప్రోటీన్ ఎక్కువగా ఉండే, ఆహార పదార్థాలను తీసుకోండి. ఇవి మిమ్మల్ని తాజాగా, ఫిట్ గా ఉంచుతాయి. నిద్ర మత్తు ని తొలగిస్తాయి. అలానే, మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార పదార్థాలను తినకండి. బద్ధకాన్ని కలిగిస్తాయి. నిద్రమత్తు కూడా వస్తుంది. కాబట్టి, కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు. పిజ్జా, అన్నం వంటివి ఎక్కువగా తింటే కూడా నిద్రమత్తు వచ్చేస్తుంది. కాబట్టి, మధ్యాహ్నం లంచ్ లో చపాతీ, కూర తీసుకోవడం మంచిది.

Afternoon Nap In Office follow these health tips to get rid of it
Afternoon Nap In Office

మధ్యాహ్నం పూట, చాలా మంది ఎక్కువగా బిర్యాని తింటుంటారు. బిర్యాని తింటే కూడా గాఢ నిద్ర వచ్చేస్తుంది. ఒళ్ళు బద్ధకంగా మారిపోతుంది. కనుక బిర్యాని తినకండి. మధ్యాహ్నం పూట తాజా కూరగాయలు, పండ్లతో చేసిన సలాడ్ ని తీసుకుంటే మంచిది. గ్రిల్ చేసిన చికెన్ వంటివి తీసుకోవచ్చు.

అప్పుడు ఉత్సాహంగా మీరు ఉంటారు. భోజనం చేశాక, నిద్ర వస్తుంటే, కాసేపు లేచి నడవండి. లేచి నడిస్తే, నిద్ర మొత్తం పోతుంది. ఒకే చోట ఎక్కువ కూర్చుంటే, శక్తి మొత్తం తగ్గిపోతుంది. కొంచెంసేపు వ్యాయామాలు చేయండి. లేదంటే, సిట్టింగ్ పొజిషన్ మార్చండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటే కూడా, నెమ్మదిగా నిద్ర మత్తు పోతుంది. ఇలా, ఈ చిన్నచిన్న చిట్కాలతో నిద్రమత్తు నుండి బయటపడండి. నిద్ర రాకుండా ఫోకస్డ్ గా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now