Karimnagars Most Wanted OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న క‌రీంన‌గ‌ర్స్ మోస్ట్ వాంటెడ్ మూవీ.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్..?

December 10, 2023 5:19 PM

Karimnagars Most Wanted OTT : ఓటీటీలో కంటెంట్ ప్ర‌ధానంగా హిట్ అయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మంచి చిత్రాల‌ని ఇటీవ‌ల డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుద‌ల చేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ క‌రీంన‌గ‌ర్స్‌ మోస్ట్ వాంటెడ్ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో రిలీజ్ చేయ‌కుండా డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేయ‌బోతున్నార‌నే టాక్ వినిపిస్తుంది. డిసెంబ‌ర్ 15 లేదా 22 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానుంద‌ని టాక్ న‌డుస్తుంది.. మ‌రి ఎందులో ఇది స్ట్రీమింగ్ కానుంది అనేదే క‌దా మీ డౌట్. తెలుగు ఓటీటీ ఆహాలో ఇది సంద‌డి చేయ‌నుంది.

ఈ చిత్రానికి బాలాజీ భువ‌న‌గిరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, ర‌మేష్ ఎలిగేటి క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. క‌రీంన‌గ‌ర్స్‌ మోస్ట్ వాంటెడ్ ఫ‌స్ట్ లుక్‌ను శ‌నివారం రిలీజ్ చేయ‌గా, ఓ న‌లుగురు యువ‌కులు ఖైదీ డ్రెస్‌ల‌లో క‌నిపిస్తోన్న‌ట్లుగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు.పోస్ట‌ర్ చూస్తుంటేనే సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రం క‌థ మొత్తం క‌రీంన‌గ‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంద‌ని, తెలంగాణ యాస‌, భాష‌ల‌తో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌నే టాక్ న‌డుస్తుంది.

Karimnagars Most Wanted OTT know the release date and streaming
Karimnagars Most Wanted OTT

చిత్రంలో న‌లుగురు స్నేహితులు ఎలా క్రిమిన‌ల్స్‌గా మారారు?వారు చేసిన నేరం ఏమిట‌న్న‌ది? రివేంజ్ డ్రామాతో ఈ సినిమాని ఎలా చూపించ‌బోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. క‌రీనంగ‌ర్స్ మోస్ట్ వాంటెడ్ మూవీలో అమ‌న్ సూరేప‌ల్లితో పాటు సాయి, రాహుల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌రీనంగ‌ర్స్ మోస్ట్ వాంటెడ్ సినిమాకు సాహిత్య సాగ‌ర్ మ్యూజిక్ అందిస్తోండ‌గా…అనంత్ శ్రీక‌ర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.అమ‌న్‌, సాయి హీరోలుగా న‌టించారు. మూవీ మంచి విజ‌యం సాధిస్తుంద‌ని మేక‌ర్స్ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now