Netflix CEO : ఎన్టీఆర్ ఇంట్లో సంద‌డి చేసిన నెట్ ఫ్లిక్స్ సీఈవో.. ఫొటో వైరల్..

December 9, 2023 12:15 PM

Netflix CEO : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం దేవ‌ర సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. దేవర చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లో ఆయ‌న వార్ 2లో హృతిక్ రోష‌న్ తో కూడా క‌లిసి ప‌ని చేయ‌నున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్లో నెట్‌ఫ్లిక్స్ సీఈఓ ప్ర‌త్య‌క్షం కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. నెట్ఫ్లిక్స్ సీఈఓ, గ్లోబల్ హెడ్ టెడ్ సరండోస్ ఫస్ట్ టైం హైదరాబాద్ లో సంద‌డి చేశారు. ఆయ‌న ముందుగా చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవి, రామ్ చరణ్ లతో టెడ్ సరండోస్ ముచ్చటించారు. వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

త‌ర్వాత ఎన్టీఆర్ ఇంటికి టెడ్ వెళ్లారు. టెడ్ సరండోస్ తో పాటు ఆయన టీమ్ కి ఎన్టీఆర్ లంచ్ ఏర్పాటు చేశారు. వారి మధ్య సినిమా గురించి ఆసక్తికర చర్చ నడిచినట్లు తెలుస్తుంది. టెడ్ సరండోస్ తో భేటీకి సంబంధించిన ఫోటోలు ఎన్టీఆర్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. టెడ్ సరండోస్ టీమ్ కి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది అన్నారు. ఎన్టీఆర్ లాగానే సరాండోస్ కూడా భోజనప్రియుడే! దాంతో ఇద్దరి మధ్య సినిమాలు, తదితర అంశాలతో పాటు ఆహార విషయం కూడా ప్రముఖంగా చర్చకు వచ్చింది. కాగా, ఈ సమావేశంలో ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా పాల్గొన్నారు.

Netflix CEO had lunch with jr ntr in his home
Netflix CEO

ఇండియాలో నెట్ ఫ్లిక్స్‌కి చెప్పుకోదగ్గ ఆదరణ లేదు. స‌బ్‌స్క్రైబ‌ర్స్ ని పెంచుకోవడానికి, రెవిన్యూ జనరేషన్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది. హాట్ స్టార్, ప్రైమ్ తో పోల్చుకుంటే నెట్ఫ్లిక్స్ ఎక్కడో ఉంది. కొన్నాళ్లుగా వారు స్టార్ హీరోల చిత్రాలపై దృష్ఠి పెట్టారు. ఇందు కోసమే ఆయ‌న మెగా, నంద‌మూరి హీరోల‌ని క‌లిసాడ‌ని అంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో వారిని క‌లిసి త‌మ సంస్థ స్థాయి మ‌రింత పెంచుకునే ప్లాన్ చేసి ఉంటాడ‌ని అంద‌రు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now