Hand Lines : చేతి మీద ఈ గుర్తులు ఉన్నాయా..? అయితే మీరు కోటీశ్వరులు అయిపోతారు..!

December 10, 2023 3:44 PM

Hand Lines : ప్రతి ఒక్కరు కూడా, ఉన్నత స్థాయికి చేరుకోవాలని అనుకుంటుంటారు. ఎవరు కూడా సమస్యలతో ఇబ్బంది పడాలని అనుకోరు. అయితే, మన రాత ఎలా ఉంది..? భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాబోతున్నటువంటివన్నీ కూడా చెయ్యి చూసి చెప్తూ ఉంటారు. మన చేతి మీద ఉన్న గీతలు బట్టి ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవచ్చు. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఎవరి అరచేతిలోనైనా ఈ ఐదు గుర్తులు ఉంటే, భవిష్యత్తులో ఏనాటికైనా కోటీశ్వరులు అవుతారని, శాస్త్రం చెప్పడం జరిగింది. చేతిలోని చేప రేఖని సంతోష రేఖ అని అంటారు. ఇది చాలా అరుదైన వేలిముద్ర చిహ్నం.

ఒక వ్యక్తి చేతిలో, ఈ చేప చిహ్నం ఉన్నట్లయితే, వాళ్ల జీవితంలో అత్యున్నత స్థానాలు అధిరోహిస్తారని, ఏ పని మొదలుపెట్టిన విజయం అందుకుంటారని తెలుస్తోంది. చేప చిహ్నం విదేశీ ప్రయాణం, అపారమైన సంపదని సూచిస్తుంది. అదే ఒకవేళ చేతి మీద జెండా చిహ్నం ఉన్నట్లయితే, ఈ వ్యక్తులు కళా రంగంలో బాగా రాణిస్తారు. అంతర్జాతీయంగా గొప్ప పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఏ పని మొదలుపెట్టిన విజయాన్ని అందుకుంటారు. గొప్ప కీర్తిని పొందుతారు.

if you have these Hand Lines then you will become wealthy
Hand Lines

చేతి మీద కనుక కమలం చిహ్నం ఉన్నట్లయితే, లక్ష్మీదేవి సంపదకి, అదృష్టానికి చిహ్నం గా దీన్ని పరిగణిస్తారు. స్వచ్ఛమైన మనసుని కూడా ఇది సూచిస్తుంది. ఈ చిహ్నం ఉన్న వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. స్వస్తిక్ చిహ్నం ఉన్నవాళ్లయితే, వాళ్ల కష్టాన్ని వాళ్లు నమ్ముకుంటారు. విజయాన్ని అందుకుంటారు.

ఆలయ చిహ్నం కనుక అరచేతిలో ఉన్నట్లయితే, లక్షలు, కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అయితే, ఈ ఆలయ చిహ్నం అనేది చాలా అరుదుగా ఉంటుంది. చూసారు కదా, చేతి మీద ఉన్న గీతలు బట్టి ఎటువంటి ఫలితం ఉంటుందని, మీ చేతిలో కూడా ఈ గుర్తులు ఉన్నాయో లేదో చూసుకోండి. మీరు కూడా భవిష్యత్తులో ఎంత మంచి పొజిషన్ లోకి వెళ్ళచ్చు అనేది తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now