Feet Smell After Removing Socks : షూస్ విప్పిన త‌రువాత పాదాలు కంపు కొడుతున్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

December 9, 2023 12:12 PM

Feet Smell After Removing Socks : చాలామంది, ఉదయం నుండి సాయంత్రం వరకు షూ వేసుకుంటూ ఉంటారు. స్కూల్ కి వెళ్లే పిల్లలు మొదలు, ఆఫీస్ కి వెళ్లే వాళ్ల వరకు, ప్రతిరోజు చాలామంది షూ వేసుకుంటూ ఉంటారు. అయితే, షూ వేసుకున్న కొంతమందిలో సమస్యలు ఉంటాయి. చాలామంది, షూ వేసుకున్న వాళ్ళల్లో, దుర్వాసన రావడం మొదలవుతుంది. ఎప్పుడు షు వేసుకుంటే కూడా, పాదాల నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. కొందరిలో చెమట ఎక్కువ వలన, దుర్వాసన వస్తుంది. షూ స్మెల్ పాదాలకి కూడా అంటుకుపోతుంది. షూ నుండి పాదాలు తీసివేసినా కూడా ఆ వాసన అలా ఉండిపోతుంది.

ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్య నుండి బయట పడడం ఈజీనే. ఒక బకెట్లో సగం వరకు నీళ్లు తీసుకోండి. ఆ తర్వాత వాటిలో బేకింగ్ సోడా వేసి, బాగా మిక్స్ చేయండి. ఈ నీటిని పాదాలని సోక్ చేయడానికి వాడండి. పాదాలని 10 నిమిషాల పాటు, ఈ నీళ్లలో పెట్టేసి తర్వాత కాళ్ళని బయటకి తీసి, కాటన్ క్లాత్ తో అరికాళ్ళు, కాలి వేళ్ళను బాగా తుడుచుకోవాలి.

Feet Smell After Removing Socks follow these simple tips
Feet Smell After Removing Socks

ఇలా చేస్తే, బేకింగ్ సోడాలో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు పాదాల దుర్వాసనని పోగొడతాయి. గోరువెచ్చని నీళ్లు తీసుకుని, కాస్త బేకింగ్ సోడా కలిపి, ఒక నిమ్మకాయని కట్ చేసేసి ఆ రసాన్ని కూడా వేసి, పది నిమిషాలు పాటు కాళ్ళను అందులో ఉంచి, బయటకు తీసిన తర్వాత కాటన్ క్లాత్ తో కాళ్ళని తుడుచుకోవాలి. వారానికి రెండు సార్లు, ఇలా చేస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది.

ఒక బకెట్ గోరు వెచ్చని నీళ్లలో అరకప్పు వెనిగర్ వేసి, 15 నిమిషాల పాటు పాదాలను అందులో పెడితే కూడా, దుర్వాసన రాకుండా ఉంటుంది. ప్రతిరోజు సాక్సులు ని మారుస్తూ ఉండండి. రోజూ సాక్స్ లని వాష్ చేస్తూ ఉండండి. అప్పుడు ఈ సమస్య తగ్గుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now