Guppedantha Manasu December 2nd Episode : శైలేంద్రకి బ్లడ్ ఇచ్చిన మహేంద్ర.. బెడ్‌ మీదనే వార్నింగ్..!

December 2, 2023 9:12 AM

Guppedantha Manasu December 2nd Episode : మహేంద్ర వస్తాడు. రిషి ఎక్కడ అని అడిగితే, పని పూర్తి చేసుకుని వస్తానని వెళ్లారని వసుధారా చెప్తుంది. నిజంగానే ఎటాక్ జరిగిందా..? అయినా వాడిని ఎవరమ్మా ఎటాక్ చేసేది. నాకు అయితే, నమ్మాలని అనిపించట్లేదు. ధరణి ని నమ్మించడానికి ఎటాక్ ప్లాన్ చేసి ఉండొచ్చు అని అంటాడు. ధరణి ఎదో చెప్తోంది కానీ నాకైతే నమ్మాలి అనిపించట్లేదు అని మహేంద్ర అంటాడు. అదే నిజమైతే, వాడంటే మూర్ఖుడు ఉండడు. ఎలా తప్పించుకుంటాడు ముకుల్ సార్ దగ్గర వాయిస్ ఉంది. వస్తే ఏం చెప్తాడు అని ధరణి అంటే, ఏదైనా ప్లాన్ చేస్తాడు. ఏం జరుగుతుందో చూద్దాం పద అని మహేంద్ర అంటాడు.

వసుధారా అక్కడే ఉండి ఆలోచిస్తుంది. మహేంద్ర అడుగుతాడు రిషి సార్ ఎక్కడికి వెళ్లారని శైలేంద్ర వాయిస్ గురించి నాతో మాట్లాడారు. ఇక్కడకి వచ్చాక పని ఉందని వెళ్లారు అని చెప్తుంది. చంపించింది తన అన్నయ్య వాయిస్ ఏ అని బాధపడుతుంటాడు. నాకోసం ధరణిని కలుద్దాం రా అని వసుధారని మహేంద్ర తీసుకువెళ్తాడు. ధరణి బాధపడుతుంది. నాకేం కాలేదు కానీ శైలేంద్ర కి అంతా అయిందని బాధపడుతుంది. అటాక్ ఎలా జరిగింది ఎంతమంది వచ్చారని, శైలేంద్ర తో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందని మహేంద్ర అడుగుతాడు.

శైలేంద్ర కి బ్లడ్ ఎక్కువ పోయిందని, వెంటనే బ్లడ్ ఎక్కించాలని డాక్టర్ వచ్చి చెప్తారు. ఈ వయసులో మీ బ్లడ్ తీసుకోలేము అని దేవయాని, ఫణింద్ర కి చెప్తారు. దేవయాని ఏడుస్తుంది. బ్లడ్ కోసం ఫణింద్ర ఎంత ట్రై చేసినా దొరకదు. నీది శైలింద్రది, ఓకే బ్లడ్ గ్రూప్ అనుమానాలన్నీ పక్కనపెట్టి, బ్లడ్ ఇచ్చి పుణ్యం కట్టుకో అని, ఫణింద్ర వేడుకుంటాడు. అన్నయ్య నేను ఇస్తాను. మీరు బాధ పడద్దు అని. మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu December 2nd Episode today
Guppedantha Manasu December 2nd Episode

దాంతో బెడ్ పై పడుకుని శైలేంద్ర కి బ్లడ్ ఇస్తాడు. కన్నింగ్ గా చూస్తాడు శైలేంద్ర. అరేయ్ శైలేంద్ర బాబాయ్ బ్లడ్ ఇవ్వడం ఏంటని చూస్తున్నావేమో, నీ కోసం ఇవ్వట్లేదు నువ్వు ప్రాణాలతో ఉండాలి. నీ నిజ స్వరూపం అందరికీ తెలియాలి అని. సమాధి పై కీర్తిశేషులు అనే టాగ్ లైన్ కూడా ఉండడం నాకు ఇష్టం లేదు. అపకీర్తి శేషులు అని ఉండాలి అని మహేంద్ర చెప్తాడు. నేను రిషి చావు దెబ్బలు కొట్టడం నేను చూడాలి. నేను మాట్లాడేది నువ్వు వింటున్నావా అని, నీ తలకెక్కుతోందని నాకు తెలుసు అని మహేంద్ర అంటాడు. అదంతా విన్న శైలేంద్ర నవ్వుతున్నట్లుగా చూస్తాడు. ఇంతలో అక్కడికి ఫణింద్ర వచ్చి, నీది చాలా గొప్ప మనసు. మహేంద్ర నువ్వు నాకు తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం అని అంటాడు. మీ అనుబంధం కోసమే శైలేంద్ర ఎన్ని పాపాలు చేసినా మీకు చెప్పలేదని వసుధార అనుకుంటుంది.

రిషి కోసం వసుధారా ఎదురు చూస్తూ ఉంటే, ముకుల్ ఎంట్రీ ఇస్తాడు వచ్చి రిషి సార్ గురించి అడుగుతాడు. రిషి సార్ ముకుల్ సార్ కోసం వెళ్లలేదా అని మనసులో అనుకుంటుంది వసుధారా. శైలేంద్ర పరిస్థితి ఎలా ఉందని ముకుల్ వస్తాడు. మహేంద్ర బ్లడ్ ఇచ్చి బయటికి వస్తాడు. నేను వెళ్లి శైలేంద్రతో ఉంటాను అని, పరిస్థితి ఎలా ఉంది స్పృహలో ఉన్నాడా అని అడుగుతాడు. లేడు అని ఫణింద్ర అంటాడు. ఒక అరగంట ఇంట్రోగేషన్ చేయండి. ఎక్కువ సేపు చూస్తే పేషెంట్ ఇబ్బంది పడే అవకాశం ఉందని వసుధార అంటుంది. ఒకవేళ కనుక వాడే తప్పు చేసి ఉంటే, నేనే ముందు శిక్షిస్తానని ఫణింద్ర అంటాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories