Sara Tendulkar : త‌న ఆవేద‌న‌ని వెళ్ల‌బుచ్చిన సారా.. డీప్‌ఫేక్ ఫోటోలపై స‌చిన్ కూతురి స్పందన‌..

November 23, 2023 9:44 PM

Sara Tendulkar : ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల‌కి స్పందించిన వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే.తాజాగా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ కూతురికి సంబంధించిన వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. స‌చిన్ కూతురు సారా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. తనకు ట్విటర్ (ఎక్స్)లో ఎలాంటి అకౌంట్ లేదన్న సారా టెండూల్కర్.. తన పేరిట అసత్య ప్రచారం సాగుతోందని వాపోయింది. తన పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి డీప్ ఫేక్ ఫోటోలను షేర్ చేస్తున్నారని మండిపడింది. నకిలీ ఖాతాలపై.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఇటీవ‌లి కాలంలో డీప్ ఫేక్ అంశం సీని ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించింది.

టాలీవుడ్ న‌టి ర‌ష్మిక మంద‌న్నాడీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోలు సంచ‌న‌లం అయ్యాయి. ఆ త‌ర్వాత చాలామంది ఆ డీప్‌ఫేక్ వీడియోల‌కు బ‌ల‌య్యారు. స్వ‌యాన దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కూడా డీప్‌ఫేక్ బారిన ప‌డిన విషయం తెలిసిందే. అనంత‌రం బాలీవుడ్ న‌టి కాజ‌ల్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఇప్ప‌డు తాజాగా స‌చిన్ టెండూల్క‌ర్ కూతురు సారా టెండూల్క‌ర్ కూడా డీప్ ఫేక్ వీడియోల‌కు గుర‌యిన‌ట్లు స్వ‌యాన త‌నే ప్ర‌క‌టించింది. ఈ వ్యాఖ్య‌లు కాస్త సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అయితే వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా గిల్‌కు విషెస్ చెబుతున్నట్లుగా సారా టెండూల్కర్ పేరిట బ్లూటిక్ మార్క్ ఉన్న ట్విటర్ అకౌంట్ నుంచి కొన్ని పోస్టులు వచ్చాయి.

Sara Tendulkar worries about her fake videos
Sara Tendulkar

ఆ స‌మ‌యంలో చాలా మంది నెటిజ‌న్స్ సారా నిజమైన అకౌంట్ అని భావించి.. ఈ అంశమై మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తన పేరిట ఉన్న నకిలీ అకౌంట్ నుంచి జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సారా టెండూల్కర్ స్పందించింది. ఎక్స్‌లో తనకు అకౌంటే లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టిన సారా టెండూల్కర్.. తన పేరిట ఉన్న నకిలీ అకౌంట్ల మీద చర్యలు తీసుకోవాలని ఎక్స్ యాజమాన్యాన్ని కోరింది. మన బాధలు, సంతోషాలు అలాగే రోజువారీ కార్యక్రమాలను పంచుకునేందుకు సోషల్ మీడియా ఓ అద్భుతమైన వేదిక.

అయితే కొంతమంది ఈ సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవాలను దాచేస్తూ అభూత కల్పనలతో ఇంటర్నెట్‌ను నింపేస్తున్నారు. నా డీప్ ఫేక్ ఫోటోలు కూడా నా దృష్టికి వచ్చాయి. ఎక్స్‌లో నాపేరుతో నకిలీ ఖాతాలు తెరిచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజానికి నాకు ఎక్స్‌లో అకౌంటే లేదు. నా పేరుతో ఉన్న నకిలీ అకౌంట్లను ఎక్స్ వీలైనంత త్వరగా గుర్తించి తొలగిస్తుందని ఆశిస్తున్నా..వాస్తవాలను పంచుకోవడానికే సోషల్ మీడియాను ఉపయోగిద్దాం” అంటూ పోస్ట్ షేర్ చేసింది సారా టెండూల్కర్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now