Sesame Seeds Water : నువ్వుల నీళ్ల‌ను రోజూ ఉద‌యాన్నే తాగితే క‌లిగే లాభాలివే..!

October 20, 2023 6:35 PM

Sesame Seeds Water : ఆరోగ్యానికి నువ్వులు చాలా మేలు చేస్తాయి. నువ్వులని తీసుకోవడం వలన, అనేక లాభాలని పొందడానికి అవుతుంది. నువ్వుల నీళ్లు తాగితే కూడా, ఆరోగ్యం బాగుంటుంది. ఒక గ్లాసు నువ్వులు వేసిన నీళ్ల ని తీసుకోవడం వలన, అనేక లాభాలని పొందవచ్చు. ముఖ్యంగా, ఉదయం పూట నువ్వులు వేసిన నీళ్ళ ని తీసుకోవడం వలన, ఆరోగ్యం మెరుగు పడుతుంది. నువ్వుల లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. క్యాల్షియం, మెగ్నీషియంతో పాటుగా మంచి కొవ్వు పదార్థాలు కూడా ఇందులో ఉంటాయి.

నువ్వులు నీళ్లు తాగితే, ఎముకలు బలంగా మారుతాయి. హృదయ సంబంధిత సమస్యలు కూడా ఉండవు. ఇంఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. క్యాన్సర్ రాకుండా కూడా, నువ్వులు బాగా ఉపయోగపడతాయి. నువ్వుల నీళ్లు తాగడం వలన, అందం కూడా మెరుగుపడుతుంది. నువ్వుల నీళ్లని, ఉదయం పూట తాగడం వలన అజీర్తి సమస్యలు తొలగి పోతాయి. నువ్వుల లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్తి సమస్యల నుండి మనల్ని దూరంగా ఉంచుతుంది.

Sesame Seeds Water take daily in the morning
Sesame Seeds Water

నువ్వుల లో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. నువ్వులను తీసుకుంటే, ఆస్తమా సమస్య బాగా తగ్గుతుంది. రెస్పిరేటరీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. క్యాన్సర్ రాకుండా, నువ్వులు మనల్ని రక్షిస్తాయి. నువ్వులలో జింక్ ఎక్కువ ఉంటుంది.

ఎముకలు దృఢంగా మారడానికి, ఇవి హెల్ప్ చేస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన డయాబెటిస్ కూడా తగ్గుతుంది. ఇలా, అనేక లాభాలని మనం నువ్వుల నీళ్లు తాగడం వలన పొందవచ్చు. కాబట్టి, రెగ్యులర్ గా నువ్వులను నీళ్ల లో వేసుకుని, ఆ నీటిని తాగేయండి. చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి అవుతుంది. పైగా ఈ సమస్యలు ఏమి కూడా ఉండవు. ఆరోగ్యంగా ఉండవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now