Dog : వాస్తు ప్ర‌కారం ఇంట్లో కుక్క‌ల‌ను పెంచ‌డం మంచిదేనా..?

September 21, 2023 5:29 PM

Dog : చాలామంది ఇళ్లల్లో పెంపుడు జంతువులని పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీ ఇంట్లో కూడా పెంపుడు జంతువులు ఉన్నాయా..? అయితే కచ్చితంగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎక్కువ శాతం మంది కుక్కలని ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు. కుక్కను పెంచుకోవడం చాలా మంచిద‌ని పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో కూడా ఒక కుక్క ఉన్నట్లయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం ఇంట్లో కుక్కని పెంచుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు.

కుక్కని ఇంట్లో పెట్టుకుంటే డబ్బుకి ఇబ్బంది ఉండదట. కుక్కని ఇంట్లో పెంచుకోవడం వలన ఎలాంటి ఫలితం ఉంటుంది..?, ఏయే సమస్యలు తొలగిపోతాయి అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇళ్లల్లో కుక్కలని పెంచడం వలన సానుకూల శక్తి ఉంటుంది. దుష్టశక్తులు అక్కడ ఉండవు. అందుకనే చాలామంది ఇళ్లల్లో కుక్కలని పెంచుకుంటూ ఉంటారు. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుందట.

can we keep dog at home according to vastu
Dog

కుక్కని పెంచుకుంటే దుష్టశక్తులు ఏవీ కూడా ఇళ్లల్లోకి రావు. ఇంట్లో కుక్కని ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంద‌ట‌. కాలభైరవుని దూతగా కుక్కని పరిగణిస్తారు. కుక్కకి ఆహారం పెడితే యమదూతల భయం ఉండదని నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కుక్కల్ని పెంచుకుంటే లక్ష్మీదేవి వారి ఇంట ఉంటుంది. ఆర్థిక సమస్యల నుండి దూరంగా ఉండ‌వ‌చ్చు. పైగా కుక్కల‌కి రోజూ ఆహారం పెట్టడం వలన శని దేవుడు సంతోషిస్తాడు.

శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం నాడు కుక్కకి రొట్టెలని పెడితే మంచిది. రాహు, కేతువు దోషాలు ఉన్నవాళ్లు శని దేవుని ఆశీస్సులని పొందడానికి శనివారం నాడు కుక్కలకి రొట్టెలని పెట్టండి. కుక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే త్వరగా పిల్లలు పుడతారట. ప్రమాదవశాత్తూ ప్రమాదాలు జరుగుతాయేమోనన్న భయం కుక్క ఇంట్లో ఉంటే తొలగిపోతుంది. ఇలా కుక్కని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇన్ని లాభాలని పొందవచ్చు.

dog

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment