Eggs : కోడిగుడ్ల‌ను తింటే గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌లు వ‌స్తాయా..?

September 21, 2023 3:43 PM

Eggs : గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకని ప్రతి రోజు కూడా చాలామంది గుడ్లు తింటూ ఉంటారు. మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కచ్చితంగా జాగ్రత్త పాటించాలి. లేదంటే అనవసరంగా లేనిపోని అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలతోపాటు గుడ్లు వంటివి తీసుకోవడం మంచిది. అయితే కొంతమంది గుడ్లు తీసుకుంటే గ్యాస్ పెరిగిపోతుందని అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా గుడ్లు తీసుకోవడం వలన గ్యాస్ పెరిగిపోతుందా…? దాని వెనుక కారణాలేంటి.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఉడికించిన గుడ్డు తినేటప్పుడు పలు సమస్యలు వస్తాయి. అలాగే ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. దాని వలన గ్యాస్ వచ్చిందని అంటారు. గుడ్ల‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ పొందాలనుకునే వాళ్ళు గుడ్ల‌ను రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. కొన్ని వాయువులు మన జీర్ణాశయం ద్వారా ఉత్ప‌త్తి అవుతూ ఉంటాయి. గుడ్డు తిన్నప్పుడు గుడ్డులో ఉండే ప్రోటీన్ల‌ని విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి.

can eating Eggs cause gas trouble
Eggs

ఒకవేళ గుడ్డు తిన్నాక పొత్తి కడుపు నొప్పి, తిమ్మిర్లు, వికారం, వాంతులు, విరేచనాలు వంటివి రావచ్చు. గుడ్డు తిన్న అరగంట నుండి రెండు గంటల లోపు లక్షణాలు ఎక్కువగా కనబడితే కచ్చితంగా మీకు గుడ్డు వలన సమస్య వచ్చిందని అర్ధం చేసుకోవచ్చు. సీరియస్ గా ఉన్నట్లయితే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. అయితే ఉడికించిన గుడ్లు తినడం వలన ఒక్కొక్కసారి సమస్యలు వస్తూ ఉంటాయి. గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం, కడుపునొప్పి, డయేరియా, వాంతులు ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి.

గుడ్లలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో సమస్యలు రావచ్చు. అలాగే పలు రకాల అజీర్తి సమస్యలు కూడా గుడ్లు తీసుకోవడం వలన రావచ్చు. గుడ్ల‌లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాసిడ్ ఎక్కువ అయ్యే సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళు గుడ్లు తీసుకోవచ్చు. సమస్య ఏమీ ఉండదు. అధికంగా ఉడికించిన గుడ్లు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment