---Advertisement---

క‌త్తి మహేష్ మ‌ర‌ణ వార్త క‌ల‌చి వేసింది.. ప్ర‌ముఖుల సంతాపం..

July 10, 2021 10:34 PM
---Advertisement---

సినీ న‌టుడు, విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ జూన్ నెల‌లో రోడ్డు ప్ర‌మాదం బారిన ప‌డి తీవ్ర గాయాల‌కు గురై హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ శ‌నివారం క‌న్నుమూసిన విష‌యం విదిత‌మే. చెన్నైలోని అపోలో హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న తుది శ్వాస విడిచారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉందంటూ వార్తు వ‌చ్చాయి. అయితే ప‌రిస్థితి విష‌మించండంతో ఆయ‌న క‌న్ను మూశారు. శ్వాస‌కోశ స‌మ‌స్యల వ‌ల్లే ఆయ‌న చ‌నిపోయార‌ని వైద్యులు తెలిపారు.

kathi mahesh death celebrities response

కాగా క‌త్తి మ‌హేష్ మృతిపై ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఆయ‌న‌తో అనుబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న లేని లోటును జీర్ణించుకోలేక‌పోతున్నారు. క‌త్తి మ‌హేష్ చ‌నిపోయార‌ని తెలిసిన వెంట‌నే తాను షాక్‌కు గుర‌య్యాన‌ని మంచు మ‌నోజ్ ట్వీట్ చేశాడు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలిపాడు. అలాగే ట్యాక్సీవాలా ప్రొడ్యూస‌ర్ ఎస్‌కేఎన్ మ‌హేష్ మృతి ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

హ్యాపీ డేస్ ఫేమ్ ఆద‌ర్శ్ క‌త్తి మ‌హేష్ మృతి ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో మ‌హేష్‌తో గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకున్నాడు. మ‌హేష్ మ‌ర‌ణించాడ‌ని తెలుసుకుని తాను షాక్‌కు గుర‌య్యాన‌ని నాచుర‌ల్ స్టార్ నాని తెలిపాడు. ఇక మ‌హేష్ అభిమానులు ఆయ‌న మ‌రణ‌వార్తను జీర్ణించుకోలేక ఆయ‌న మృతి ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now