Curry Leaves : క‌రివేపాకును రోజూ ఇలా తీసుకుంటే.. ఇన్ని ప్ర‌యోజ‌నాలా..?

September 16, 2023 9:44 PM

Curry Leaves : కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలామంది కరివేపాకుని తినకుండా ఏరి పారేస్తూ ఉంటారు. నిజానికి కరివేపాకు వల్ల ఉన్న లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యానికి కరివేపాకు చాలా మేలు చేస్తుంది. కరివేపాకు వలన చాలా సమస్యలకి చెక్ పెట్టొచ్చు. కరివేపాకుని తీసుకోవడం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. కరివేపాకుని తీసుకుంటే రక్తపోటు ప్రమాదం నుండి బయటపడొచ్చు. బ్లడ్ ప్రెషర్ ని ఇది తగ్గిస్తుంది.

కరివేపాకుని తీసుకోవడం వలన రక్త ప్రసరణ కూడా బాగా అవుతుంది. కరివేపాకుని తీసుకోవడం వలన తలనొప్పి కూడా బాగా తగ్గుతుంది. జుట్టు సమస్యలు రాకుండా కరివేపాకు చూసుకుంటుంది. జీర్ణశక్తి కరివేపాకుతో మెరుగు పడుతుంది. అజీర్తి వంటి సమస్యల్ని కూడా కరివేపాకు పోగొడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ఫ్యాట్ ని కరిగిస్తుంది కరివేపాకు. కరివేపాకు జుట్టు మూలాలని బాగా బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు కరివేపాకు సహకరిస్తుంది.

take daily Curry Leaves for many wonderful benefits
Curry Leaves

కరివేపాకు వేర్లు శరీర నొప్పులని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కరివేపాకు చర్మ సంరక్షణకు కూడా బాగా సహాయం చేస్తుంది. ఈ ఆకుల రసం కానీ పేస్ట్ కానీ చర్మంపై రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. కాలిన, తెగిన గాయాల‌పై రాస్తే మన చర్మం దురద పెట్టకుండా ఉంటుంది. కరివేపాకులో విటమిన్ ఎ ఎక్కువ ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ తోపాటు క్యాల్షియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి.

మెగ్నీషియం, రాగి కూడా ఇందులో ఉంటాయి. కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడగలవు. జీర్ణ సమస్యలు కూడా ఉండవు. డయేరియాని కూడా ఇది నివారిస్తుంది. కరివేపాకుని మనం రకరకాలుగా వంటల్లో వేసుకోవచ్చు. కరివేపాకుతో టీ చేసుకోవచ్చు. సూప్ వంటివి కూడా చేయొచ్చు. కరివేపాకుతో రుచిగా పచ్చడి వంటివి కూడా తయారు చేసుకుని తీసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment