Rice For Beauty : అన్నంతో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోతుంది..!

September 2, 2023 8:35 AM

Rice For Beauty : అందంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. అందంగా ఉండాలన్నా, మన చర్మం మెరిసిపోవాలన్నా ఇంటి చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తేనే, అందంగా ఉండొచ్చు అనుకుంటే పొరపాటు. నిజానికి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వలన నష్టమే కానీ ఎక్కువ ప్రయోజనం ఏమీ కలగదు. పైగా వందలు, వేలు పోసి కొనుక్కోవాలి. ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలంటే, ఇలా సులభంగా మనం మార్చేయవచ్చు.

పైగా ఇలా చేస్తే, నల్లని మచ్చలు వంటివి కూడా పోతాయి. ఉడికించిన అన్నం, బాదం నూనె ఉంటే చాలు. ఇక మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అన్నంలో పోషకాలు ముఖం మీద ఉండే, పిగ్మెంటేషన్ సమస్యను తొలగిస్తాయి. మిమ్మల్ని యవ్వనంగా అన్నం మారుస్తుంది. చర్మ సంరక్షణలో బియ్యం, అన్నం, బియ్యం పిండి వంటివి ఎంతో సహాయ పడతాయి. దీని కోసం మీరు కొంచెం అన్నం తీసుకుని, మిక్సీ జార్ లో వేసి, కొంచెం నీటిని పోసి పేస్ట్ లాగా చేసుకోండి.

Rice For Beauty how to use it for better effect
Rice For Beauty

ఇప్పుడు ఒక బౌల్ లోకి ఈ పేస్ట్ ని వేసేసి, ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా మిక్స్ చేయండి. బాదం నూనెలో ఉండే పోషకాలు ముఖం మీద మచ్చలు లేకుండా స్కిన్ బాగుండేటట్టు చేస్తాయి. ముఖాన్ని కాంతివంతంగా బాదం నూనె మారుస్తుంది. అయితే, ముఖం మీద ఈ మిశ్రమాన్ని రాసి రెండు నిమిషాలు మసాజ్ చేయండి.

అరగంట పాటు అలా వదిలేసి, తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోండి. ఇలా మీరు మీ ముఖంపై దీన్ని రాయడం వలన ముడతలు, మచ్చలు వంటివి పోతాయి. కాంతివంతంగా మీ ముఖం మారుతుంది. అందంగా ఉంటారు. కాబట్టి, ఈసారి ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. ఇక మీ ముఖం అందంగా మారిపోతుంది. మెరిసిపోతుంది. మచ్చలు వంటి సమస్యలు కూడా వుండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment