Lord Ganesh And Lakshmi : వినాయ‌కుడు, ల‌క్ష్మీదేవి.. ఈ ఇద్ద‌రినీ క‌లిపే పూజించాలి.. ఎందుకంటే..?

September 1, 2023 10:03 PM

Lord Ganesh And Lakshmi : మొట్టమొదట మనం వినాయకుడిని పూజిస్తాము. ఏ దేవుడిని పూజించాలన్నా, ముందు గణపతిని పూజించి, ఆ తర్వాత మనం మిగిలిన దేవతలని, దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటాము. అలానే, రాముడుని కొలిచేటప్పుడు, రాముడితో పాటుగా సీతాదేవి, లక్ష్మణులను కలిపి పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు, గణపతిని కూడా పూజిస్తూ ఉంటారు. సంపద యొక్క దేవత అయిన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తూ గణపతిని కూడా పూజిస్తారు.

డబ్బుకి సంబంధించిన లక్ష్మీదేవి కంటే కూడా ప్రత్యేకంగా వినాయకుడిని పూజిస్తూ ఉంటాము. వినాయకుడితో కలిపి ఉన్న లక్ష్మీదేవిని చాలామంది ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అందుకు కారణాలు ఏంటి..?, వీళ్ళిద్దరిని ప్రత్యేకంగా పూజించడానికి ఉండే కారణాల గురించి తెలుసుకుందాం. వినాయకుడిని ఆది దేవుడిగా భావించి, మనం పూజలు చేస్తూ ఉంటాము. ధర్మ మార్గంలో ఉన్న అడ్డంకులు అన్నింటినీ వినాయకుడు తొలగిస్తాడు.

Lord Ganesh And Lakshmi we must do pooja them combined
Lord Ganesh And Lakshmi

మన పనికి ఏ విఘ్నం కలగకుండా చూస్తాడు. అందుకే, క‌చ్చితంగా గణపతిని పూజించాలి. శుభకార్యాలు జరపాలన్నా, దేనినైనా మొదలు పెట్టాలన్నా, పెళ్ళికి అయినా ముందు గణపతిని కొలుస్తాము. లక్ష్మీదేవిని చూసుకున్నట్లయితే, ఆమె సంపదకి అధిపతి. ధనం లేకుండా ఈ లోకం అనేది లేదు. అయితే, జీవితంలో ఏ అడ్డంకులు కలగకూడదని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంటారు. లక్ష్మీదేవి సంపద ఇస్తుంది.

వినాయకుడు అడ్డంకులు తొలగిస్తాడు. అందుకని, వీళ్ళిద్దరినీ కలిపి ఆరాధించడం మంచిది. అడ్డంకులన్నీ తొలగిపోయి, సంపద కలగాలని గణపతిని, లక్ష్మీదేవిని కలిపి పూజిస్తారు. పూర్వకాలంలో ఒకసారి ఒక సాధువు లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెడతాడు. ఒకరోజు తనకి లక్ష్మీదేవి కనపడి గణపతిని అవమానించారని, ముందు వినాయకుడికి పూజ చేయాలని, లక్ష్మీదేవి చెప్తుంది. అప్పటినుండి ఆ సాధువు వినాయకుడి కోపం తగ్గించడానికి, వినాయక పూజని మొదలుపెడతాడు. తర్వాత వినాయకుడు ఆ సాధువు కోరికని తీరుస్తాడు. అలా వినాయ‌కుడిని, ల‌క్ష్మీదేవిని క‌లిపి పూజించ‌డం మొద‌లైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment