వీటిని రోజూ తీసుకుంటే చాలు.. కొలెస్ట్రాల్ పూర్తిగా క‌రిగిపోతుంది..!

August 29, 2023 5:18 PM

అధిక కొవ్వు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అయితే అదనపు చెడు కొవ్వును తొలగించుకోవాలంటే ఇలా చేయండి. ఇలా ఈజీగా మీరు అదనపు చెడు కొవ్వుని తగ్గించుకోవచ్చు. ఏ బాధ లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. వ్యాయామం చేయడం వలన అధిక బరువు సమస్య నుండి దూరంగా ఉండొచ్చు. ధూమపానం వంటి చెడ్డ అలవాట్లకి కూడా దూరంగా ఉండాలి. అయితే చెడు కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతుంది…?, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి మార్గాలు ఏవి అనేది ఇప్పుడు చూద్దాం.

కొవ్వు బాగా తగ్గాలంటే ఈ జ్యూస్ లని తీసుకోండి. వీటిని తాగడం వలన కొవ్వు బాగా తగ్గుతుంది. దానిమ్మ ఆరోగ్యానికి చాలా మేలు చూస్తుంది. దానిమ్మతో చక్కటి లాభాలని పొందొచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ని కూడా దానిమ్మ తగ్గిస్తుంది. దానిమ్మ రసాన్ని తాగడం వలన కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. దానిమ్మ రసం తీసుకునేటప్పుడు కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకుని తీసుకుంటే పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ని తగ్గించవచ్చు.

take these foods daily to reduce cholesterol

నారింజ రసం కూడా అందుకు బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తో బాధపడే వాళ్ళు నారింజ రసాన్ని తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ నుండి బయటపడొచ్చు. టమాట జ్యూస్ కూడా ఇందుకు బాగా పనిచేస్తుంది. టమాటాలో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. టమాటా జ్యూస్ ని తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది.

జీర్ణవ్యవస్థని టమాట ఆరోగ్యంగా ఉంచుతుంది. గుమ్మడికాయ జ్యూస్ కూడా ఇందుకు పనిచేస్తుంది. గుమ్మడికాయ జ్యూస్ లో బీటా కెరోటీన్ వంటి శక్తవంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గుమ్మడి రసాన్ని తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. ఓట్ మీల్ కూడా ఇందుకు సహాయం చేస్తుంది. ఇలా వీటి ద్వారా ఈజీగా చెడు కొలెస్ట్రాల్ సమస్య నుండి బయట పడొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment