Holding Urine : మూత్రాన్ని ఎక్కువగా ఆపుకుంటే.. ఈ సమస్యలు తప్పవు..!

August 8, 2023 9:37 AM

Holding Urine : చాలా మంది పనిలో పడిపోయి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి తప్పుల వలన మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది జాగ్రత్త. ఎక్కువ మంది మూత్రం వచ్చినా కూడా, వెళ్లకుండా ఆపేసుకుంటూ ఉంటారు. కానీ, అది నిజానికి చాలా పెద్ద తప్పు. అలా అస్సలు చేయకూడదు. సరైన టైం కి మూత్ర విసర్జన చేయక పోవడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. యూరిన్ కి వెళ్లకుండా ఆపేసుకోవడం అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూత్రాన్ని ఆపుకోవడం వలన ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూసేద్దాం. మూత్రం వచ్చినట్లయితే, అసలు ఆపుకోకూడదు. మూత్ర విసర్జన చేయాల్సిన టైం వచ్చినప్పుడు, వెంటనే మూత్ర విసర్జన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత్రాన్ని ఆపుకోకూడదు. మూత్రాశయం నిండినప్పుడు, మూత్ర విసర్జన చేయకపోతే అనేక సమస్యలు కలుగుతాయి. మూత్ర విసర్జన చేయకపోవడం వలన పెల్విక్ ఫ్లోర్ దెబ్బతింటుంది. మూత్రాశ‌యం నిండే దాకా కూడా ఆగవ‌ద్దు. మూత్రాన్ని ఆపుకోవడం వలన మూత్రాశ‌య‌ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది.

Holding Urine long time is unhealthy
Holding Urine

మూత్ర విసర్జన తరచూ చేస్తూ ఉండడం వలన ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. నీరు ఎక్కువ తాగుతూ ఉంటే, ఆరోగ్యానికి మంచి జ‌రుగుతుంది. ఆరోగ్యవంతమైన శరీరానికి రోజుకి ఒకటిన్నర నుండి రెండున్నర లీటర్ల వరకు నీళ్లు కావాలి. ఎక్కువ నీళ్లు తాగితే, పదేపదే విసర్జన చేయాల్సి వస్తుంది. వ్యాయామం చేసే వాళ్ళు ఎక్కువ నీళ్లు తాగాలి. అలానే వేసవికాలంలో కూడా ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా మనుషుల బ్లాడర్ 400 మిల్లీమీటర్ల నుండి 600 మిల్లీమీటర్ల వరకు మూత్రాన్ని ఉంచుకుంటుంది. ఆ పరిమితి దాటితే, బ్లాడర్ మీద ఒత్తిడి బాగా పెరిగిపోతుంటుంది.

అయితే ఈ పరిమితి దాటిన తర్వాత మూత్రాన్ని ఆపుకోవడం వలన ఒత్తిడి కలిగి, బ్లాడర్ పరిమాణం పెరుగుతుంది. ఎప్పుడో ఒకసారి మూత్రాన్ని ఆపుకుంటే, ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ తరచూ ఇలా చేస్తున్నప్పుడు మాత్రం సమస్యలు కలుగుతాయి. అనేకసార్లు మూత్రం ఆపుకుంటే, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుంటే తీవ్రమైన నొప్పి కూడా కలగ‌వ‌చ్చు. కాబట్టి అసలు ఈ పొరపాట్లు చేయకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment