Heart Problem : ఈ ల‌క్ష‌ణాలు ఉన్నాయా.. అయితే వెంట‌నే గుండె వైద్యున్ని క‌ల‌వాల్సిందే..!

July 31, 2023 6:28 PM

Heart Problem : ఈ మధ్యకాలంలో హృదయ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వయస్సు తేడా లేకుండా చాలా మంది హార్ట్ ఎటాక్ వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. గుండె ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. గుండె ఆరోగ్యంగా లేకపోతే అది మన ప్రాణానికే ప్రమాదం. మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా హృదయ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే మీరు కూడా కచ్చితంగా రెగ్యులర్ గా చెక్ అప్ చేయించుకోవడం మంచిది. గుండె సమస్యలు కుటుంబీకుల నుండి కూడా రావచ్చు.

కాబట్టి కచ్చితంగా మీరు కూడా గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అలానే డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు గుండె ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధ వహించాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతే గుండెకి కూడా ముప్పు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా గుండె చెక్ అప్స్ చేయించుకోవడం మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగినప్పుడు ర‌క్త నాళాలు డ్యామేజ్ అవుతాయి. దానితో పాటుగా గుండె కూడా పాడవుతుంది.

Heart Problem if you have these signs and symptoms then consult cardiologist
Heart Problem

ఒకవేళ కనుక రెగ్యులర్ గా చెక్ చేసే డాక్టర్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే అస్సలు అశ్రద్ధ చేయకండి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా వున్నా, ఊపిరి సరిగ్గా ఆడకపోయినా అసలు నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే డాక్టర్ ని కన్సల్ట్‌ చేయండి. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే కచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఛాతి నొప్పి కలుగుతున్నట్లయితే కూడా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం ముఖ్యం. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా రెగ్యులర్ గా చెక్ చేయించుకోవడం మంచిది.

ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వాళ్లు కూడా డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తూ ఉండాలి. గుండె ఆరోగ్యం కోసం మంచి జీవన విధానాన్ని పాటించడం, గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం, ఒత్తిడి లేకుండా ఉండడం, ప్రతిరోజూ వ్యాయామానికి కాస్త సమయాన్ని ఇవ్వడం ఇలాంటివి చేస్తే గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండ‌వ‌చ్చు. లేకపోతే అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment