Beetroot : బీట్‌రూట్ ను తింటున్నారా.. ఈ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు తీసుకోకూడ‌దు..!

July 12, 2023 12:35 PM

Beetroot : మనం తీసుకునే ఆహారంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటే, ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. చాలా మంది బీట్ రూట్ ని ఇష్టపడరు. కానీ బీట్ రూట్ ని తీసుకోవడం వలన ఎన్నో లాభాలని పొందొచ్చు. ఈ లాభాలను చూస్తే కచ్చితంగా మీరు కూడా బీట్ రూట్ ని తినడం అలవాటు చేసుకుంటారు. బీట్ రూట్ ని తీసుకోవడం వలన బరువు తగ్గడానికి అవుతుంది. రక్తహీనత, గుండె సమస్యలకు దూరంగా ఉండొచ్చు. బీట్ రూట్ లో ఉండే పోషక పదార్థాలు మనల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి.

బీట్ రూట్ వల్ల కలిగే లాభాల గురించి, ఎవరు బీట్ రూట్ ని తీసుకోకూడదు అనే విషయాల‌ను ఇప్పుడు చూద్దాం. బీట్ రూట్ తీసుకుంటే మైనర్ తలసేమియా, రక్తహీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఐరన్ అనేది చాలా ముఖ్యం. ఐరన్ లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. బీట్ రూట్ ని తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. కాలేయం శుభ్రంగా ఉంటుంది కూడా.

Beetroot if you have these problems then do not take it
Beetroot

బీట్ రూట్ ని తీసుకోవడం వలన హృదయ సంబంధిత సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు. అథ్లెట్స్ బీట్ రూట్ ని తీసుకుంటే స్టామినా బాగా పెరుగుతుంది. క్రీడల సమయంలో క్రీడాకారులు 90 నిమిషాల ముందు బీట్ రూట్ జ్యూస్ ని తీసుకుంటే, శక్తి బాగా పెరుగుతుంది. రోజూ ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్ ని తీసుకుంటే, సులభంగా కొవ్వుని కరిగించుకోవచ్చు. ఉత్సాహంగా ఉండడానికి అవుతుంది. బీట్ రూట్ ని తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ ని తీసుకుంటే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. ఫోలిక్ యాసిడ్ అందుతుంది. కొందరిలో బిటురియా ఉంటుంది. అంటే బీట్ రూట్ తిన్న తర్వాత మలం, మూత్రం ఎరుపు రంగులో రావడం. ఆక్స‌లేట్ అనేది సహజంగా బీట్ రూట్ లో ఉంటుంది. అటువంటి సమస్య ఉన్నట్లయితే బీట్ రూట్ ని తీసుకోవద్దు. కానీ ఏమీ పెద్ద ప్రమాదం కాదు. అయితే కిడ్నీలో రాళ్ల‌ సమస్య ఉన్నవారు ఆక్స‌లేట్ ని అందించే బీట్ రూట్ ని తీసుకోకూడదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment