వారంలోని 7 రోజుల్లో ఒక్కో రోజు ఏ క‌ల‌ర్ దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిదో తెలుసా..?

June 17, 2023 8:38 AM

మార్కెట్‌లో మ‌న‌కు అనేక ర‌కాల దుస్తులు అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా స‌రే త‌మ ఇష్టాలు, అభిరుచులు, స్థోమ‌త‌కు అనుగుణంగా దుస్తుల‌ను కొని లేదా కుట్టించి ధ‌రిస్తుంటారు. అయితే దుస్తుల‌ను ధ‌రించే విష‌యంలోనూ జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం కొన్ని నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజు నిర్దిష్ట‌మైన రంగులు క‌లిగిన దుస్తుల‌ను ధ‌రించాల్సి ఉంటుంది. దీంతో మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక వారంలోని 7 రోజుల్లో ఒక్కో రోజు ఏయే రంగు దుస్తుల‌ను ధ‌రించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదివారం రోజు తెలుపు, నీలిరంగు, న‌లుపు, బ్రౌన్ క‌లర్ త‌ప్ప మిగిలిన ఏ రంగు దుస్తుల‌ను అయినా స‌రే ధ‌రించ‌వ‌చ్చు. సోమ‌వారం మిల్కీ వైట్‌, బూడిద రంగు, నారింజ‌, ఆకుప‌చ్చ‌, చిల‌క‌ప‌చ్చ రంగు దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది. సోమ‌వారం బ్రౌన్ క‌ల‌ర్ దుస్తుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ధ‌రించ‌రాదు. మంగ‌ళ‌వారం ఎరుపు, వంకాయ‌, ఆరెంజ్‌, ప‌సుపు, మిల్కీ వైట్‌, గ్రే, గులాబీ రంగు దుస్తుల‌ను ధ‌రించాలి. అదే రోజు ఆకుప‌చ్చ‌, చిల‌క‌ప‌చ్చ‌, బ్రౌన్ క‌ల‌ర్ దుస్తుల‌ను ధ‌రించ‌రాదు.

wear these color dresses in these days in a week

బుధ‌వారం ఆకుప‌చ్చ‌, చిల‌క‌ప‌చ్చ‌, ఆరెంజ్‌, తెలుపు రంగు దుస్తుల‌ను ధ‌రించాలి. మిల్కీ వైట్ దుస్తుల‌ను ధ‌రించ‌రాదు. గురువారం ప‌సుపు, ఆరెంజ్‌, మిల్కీ వైట్‌, ఎరుపు, మెరూన్‌, వంకాయ‌, గ్రే క‌ల‌ర్‌, గులాబీ క‌ల‌ర్ దుస్తుల‌ను ధ‌రించాలి. అదే రోజు ఆకుప‌చ్చ‌, తెలుపు రంగు దుస్తుల‌ను ధ‌రించరాదు. శుక్ర‌వారం రోజు తెలుపు, ఆకుప‌చ్చ‌, చిల‌క‌ప‌చ్చ‌, బ్రౌన్ క‌ల‌ర్‌, నీలి రంగు, న‌లుపు, గులాబీ రంగు దుస్తుల‌ను ధ‌రించాలి. అదే రోజు ఆరెంజ్‌, మిల్కీ వైట్‌, గ్రే క‌ల‌ర్ దుస్తుల‌ను ధ‌రించ‌రాదు. శ‌నివారం రోజు నీలి రంగు, న‌లుపు, తెలుపు, ఆకుప‌చ్చ‌, చిల‌క‌ప‌చ్చ‌, బ్రౌన్ క‌ల‌ర్ దుస్తుల‌ను ధ‌రించాలి. అదే రోజు ఆరెంజ్, మిల్కివైట్, గ్రే కలర్, మెరూన్ కలర్, ఎరుపు రంగు, గులాబి రంగు దుస్తుల‌ను ధ‌రించ‌రాదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment