Touching Elders Feet : పెద్దల పాదాలకు నమస్కారం చేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

March 18, 2023 9:24 AM

Touching Elders Feet : మన కన్నా పెద్ద వారి కాళ్లకు వంగి దండం పెట్టి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది భారతీయ సాంప్రదాయంలోనే ఉంది. మన దేశంలో అనేక వర్గాలకు చెందిన వారు ఈ ఆచారాన్ని పాటిస్తారు. దీంతో పెద్దల ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని దాంతో పిల్లలకు సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని అందరూ నమ్ముతారు. ఆ కోవలోనే ఎవరైనా తమ కన్నా వయస్సులో పెద్ద అయిన వారి కాళ్లకు నమస్కరిస్తారు. అయితే నిజానికి ఇందులో మనకు తెలియని పలు విషయాలు దాగి ఉన్నాయి. శాస్త్రం పరంగానే కాదు, సైన్స్‌ పరంగా కూడా ఇలా చేయడం మనకు మంచిదే. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేహంలో పాదాలు అనేవి మన శరీరం మొత్తం బరువును మోస్తాయి. అవి మన దేహానికి ఆధారం వంటివి. అవి లేకుండా మనం నిలుచులేం. సృష్టిలో కేవలం కొన్ని పక్షులు, జంతువులకు తప్ప ఇలా పాదాలపై అదే పనిగా నిలబడగలిగే సామర్థ్యం ఏ జీవికీ లేదు. అందుకే అలాంటి పాదాలకు నమస్కరించాలని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే మనం పెద్దవాళ్ల పాదాలకు నమస్కరిస్తాం.

Touching Elders Feet what are the benefits
Touching Elders Feet

పెద్దవాళ్లంటే.. వారికి జీవితంపై ఎంతో అనుభవం ఉంటుంది. పిల్లల కన్నా ఎంతో జ్ఞానాన్ని వారు కలిగి ఉంటారు. వారికి చాలా విషయాలు తెలిసి ఉంటాయి. అలాంటప్పుడు వారి పాదాలకు నమస్కరిస్తే వారి జ్ఞానం, తెలివి తేటలు, జీవిత అనుభవం అన్నీ పిల్లలకు వస్తాయని, వారు జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుతారని విశ్వసిస్తారు. కనుకనే పెద్దల పాదాలకు పిల్లలు నమస్కరిస్తారు.

పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం పొందితే వారి విజ్ఞానం పిల్ల‌లకు అందుతుందని అధర్వణ వేదం చెబుతోంది. పెద్దల పాదాల‌కు నమస్కరించినప్పుడు వారిలో ఉండే పాజిటివ్‌ శక్తి పిల్ల‌లకు చేరుతుందట. అలాగే పిల్ల‌ల్లో ఉండే పాజిటివ్‌ ఎనర్జీ పెద్దలకు ప్రసారమవుతుందట. దీంతో ఇద్దరికీ ఉండే ఆరోగ్య సమస్యలు పోతాయట. సైన్స్‌ ప్రకారం అలా వంగి పాదాలకు నమస్కరిస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుందట. దీంతో గుండె సమస్యలు రావట.

ఇవీ.. పెద్దల పాదాలకు నమస్కారం చేయడానికి, వారి ఆశీస్సులు తీసుకోవడానికి వెనుక ఉన్న కారణాలు. అయితే పాదాలకు నమస్కరించినప్పుడు కుడి చేతితో కుడి పాదాన్ని, ఎడమ చేతితో ఎడమ పాదాన్ని తాకి నమస్కారం తీసుకోవాలట. అలా నమస్కారం చేయడమే సరైందని పురాణాలు చెబుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment