Cloves Tea : ఈ సారి టీ చేసేట‌ప్పుడు ఇలా చేయండి, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

March 14, 2023 11:14 AM

Cloves Tea : ఉదయం లేవగానే టీ తాగడం అందరికీ అలవాటు. కొంతమందికి టీ తాగకపోతే ఆ రోజంతా ఏదో కోల్పొయినవాళ్లలా ఫీలవుతారు. ఆరోగ్యంపై శ్రద్ద పెరిగి టీలో కూడా చాలా రకాలు వచ్చాయి. లెమన్ టీ, పుదీనా టీ, అల్లం టీ ఇలా. ఈసారి డిఫరెంట్ గా లవంగాల టీ ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. లవంగాలతో చేసిన టీ తాగినట్టయితే జీర్ణక్రియను పెంపొందిస్తుంది. భోజనానికి ముందు ఒక కప్పు లవంగాల‌ టీ తాగటం వలన అజీర్ణం, పొట్టలో కలిగే అసౌకర్యాలు, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కార్మినేటివ్ గుణాలను కలిగి ఉండే లవంగాల‌ టీ అపానవాయువు (గ్యాస్) వంటి సమస్యల నుండి, ఉదర భాగంలో కలిగే నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

కీళ్ళనొప్పులు, కండరాల నొప్పి లేదా చీలమండల కండరాలు దెబ్బ తినటం వలన కలిగే నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు లవంగాలతో చేసిన టీ బాగా పనిచేస్తుంది. లవంగాల టీ తయారు చేసి శుభ్రమైన వ‌స్త్రాన్ని టీలో ముంచి నాన్చండి. ఈ నానిన వ‌స్త్రాన్ని ప్రభావిత భాగంపై 20 నిమిషాల పాటు ఉంచండి. ఇలా రోజూ రెండు నుండి 3 సార్లు చేయటం వలన మంచి ఫలితం మీరే గమనిస్తారు. లవంగంతో చేసిన టీకి కొద్దిగా నాన్- క్లోరిన్ నీటిని కలపండి. ఈ రకం గాఢ‌త తక్కువగా గల టీని యాంటీ ఫంగల్ డౌచ్ (శరీర అవయవాలను శుభ్రం చేసుకోటానికి ఉపయోగించే ద్రవం)గా యోని ప్రాంతంలో కలిగే ఈస్ట్ ఇన్ఫెక్షన్ లను తగ్గించే ద్రవంగా వాడవచ్చు.

Cloves Tea benefits must take it daily
Cloves Tea

నలుపు, ఎరుపు వెంట్రుకలు కలిగి ఉండి జుట్టు అందవిహీనంగా ఉంటే లవంగాలతో చేసిన టీ జుట్టుకు అప్లై చేయండి. దాని వలన ఎరుపు జుట్టును మరింత ప్రకాశవంతగా మార్చి హైలైట్ అయ్యేలా చేస్తుంది. తలస్నానం చేశాక చివరలో లవంగాల‌ టీ తో కడిగి శుభ్రమైన నీటితో మళ్లీ కడగండి. మార్పు గమనించండి. పిక్నిక్ లేదా ట్రిప్ లలో ఒక బాటిల్ లో లవంగాలతో చేసిన టీ మీతో తీసుకెళ్ళండి. మంచి హ్యాండ్ వాష్ గా పని చేస్తుంది. కొద్దిగా ఈ టీని తీసుకొని చేతులకు రాసుకోండి. ఇలా రోజు భోజనానికి ముందు, తరువాత ఈ టీ ని చేయికి రాసుకోవటం ఒక అలవాటుగా చేసుకోండి. యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండే ఈ టీ చేతులను శుభ్రం చేస్తుంది. క‌నుక ల‌వంగాల టీని ఎల్ల‌ప్పుడూ ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. ఇలా ఈ టీతో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment