Kantara Movie Kamala : కాంతారా మూవీలో క‌మ‌ల పాత్ర‌లో న‌టించిన ఈమె ఎవ‌రో తెలుసా..?

October 21, 2022 9:06 PM

Kantara Movie Kamala : శాండిల్ వుడ్ సత్తా ఏంటో మళ్లీ రుజువైంది. మొన్న కేజీఎఫ్, నిన్న విక్రాంత్ రోణ, నేడు కాంతారాతో కన్నడ చిత్రసీమ అందరూ అనుకుంటున్నట్టు వెనకబడి లేదని, కథల రూపకల్పనలో, వాటిని తెరకెక్కించడంలో ఇతర భాషలతో పోటీ పడుతోందని నిరూపిస్తోంది. మధ్యలో కొన్ని పాన్ ఇండియా కన్నడ చిత్రాలు పరాజయం పాలైనా, కేజీఎఫ్‌, కాంతారా చిత్రాల విజయంతో శాండిల్ వుడ్ మళ్లీ మారుమ్రోగి పోతుంది. ప్రముఖ దర్శకుడు రిషబ్ శెట్టి తానే ప్రధాన పాత్రను పోషించి, రూపొందించిన కాంతారా కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.

దీని తెలుగు వర్షన్ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా తిరుగులేని విజయాన్ని సాధించింది. అయితే కాంతారా సినిమాలో కమల పాత్రలో అమ్మ పాత్ర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. హీరో శివ తల్లి కమల పాత్ర నిజమైన పల్లెటూరి మహిళ. తన కొడుకు శ్రేయస్సు మరియు భద్రతను మాత్రమే కోరుకునే చిన్న ప్రపంచంలో జీవించే మహిళగా కమల కనిపించింది. అయితే ఈ పాత్రలో ఎవరు నటించారో తెలుసా..!? ఆమె.. మానసి సుధీర్ లాక్‌డౌన్ సమయంలో పిల్లల ప్రదర్శన పాటలు పాడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

Kantara Movie Kamala do you know about her
Kantara Movie Kamala

శివ తల్లి పాత్రలో మానసి సుధీర్ నటించింది. కమల పాత్రలో మానసి కనిపించగా, భర్తను కోల్పోయిన మహిళగా కనిపించింది. ఇటీవల సినిమాల్లో తల్లి పాత్ర ఎక్కువగా హైలైట్ అవుతుండగా ఇక్కడ కూడా తల్లి పాత్ర చాలా అందంగా కనిపిస్తుంది. డ్యాన్స్‌లో నిష్ణాతురాలైన ఆమె తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పిల్లలకు ఇష్టమైన వ్యక్తిగా మారింది. టీచర్ అయిన మానసి లాక్ డౌన్ సమయంలో పిల్లల పాటల ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. కాంతారా సినిమా బాక్సాఫీస్ హిట్ కావడంతో మానసి సుధీర్ కు రానున్న కాలంలో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మానసి వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment