Brahmastra Movie : ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్రహ్మాస్త్ర.. స్ట్రీమింగ్ ఎందులో.. ఎప్పుడంటే..?

September 29, 2022 7:38 PM

Brahmastra Movie : ఇటీవల బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బాయ్ కాట్ సెగ. దీంతో బాలీవుడ్ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయింది. వచ్చిన సినిమా వచ్చినట్లే ఫ్లాపవుతూ వస్తోంది. ఈ ఏడాది విడుదలవుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అక్కినేని నాగార్జున.. ఇలా ఈ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ వుంది. పైగా జక్కన్న రాజమౌళి ఈ సినిమాను తెలుగులో సమర్పించాడు. అలాగే సినిమాను తనదైన స్టయిల్లో ప్రమోట్ చేశాడు.

దీంతో బ్రహ్మాస్త్ర మూవీ బాలీవుడ్ కు కాస్త ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9వ తేదీన‌ పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. అన్నీ భాషల్లోనూ మంచి కలెక్షన్లను రాబట్టి ఏకంగా రూ.400 కోట్ల క్లబ్ లో చేరింది. గ్రాండ్ గా థియేటర్ల‌లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ప్రస్తుతం డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Brahmastra Movie to stream on OTT know the app and details
Brahmastra Movie

విడుదలైన నెల రోజులకే ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రసారం చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని అక్టోబర్ 3వ వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. థియేటర్ల‌లో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. అలాగే త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment