కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటానికి ముందు, త‌రువాత మ‌ద్యం సేవించ‌వ‌చ్చా ?

June 10, 2021 3:08 PM

దేశ వ్యాప్తంగా కోవిడ్‌ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం జోరుగా కొన‌సాగుతోంది. మ‌రో 2 నెల‌ల్లో దేశంలో 44 కోట్ల డోసులు సిద్ధం చేస్తామ‌ని కేంద్రం ఇప్ప‌టికే చెప్పింది. ఈ నెల 21వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు పైబ‌డిన అంద‌రికీ టీకాల‌ను ఉచితంగా అందిస్తామ‌ని కూడా కేంద్రం వెల్ల‌డించింది. అయితే టీకాల‌ను తీసుకోవ‌డంలో చాలా మందికి సందేహాలు వ‌స్తున్నాయి. వాటిల్లో స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తున్న సందేహం.. కోవిడ్ టీకా తీసుకుంటానికి ముందు, త‌రువాత మ‌ద్యం సేవించ‌వ‌చ్చా ? అని.. అయితే ఇందుకు వైద్య నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారంటే..

can you drink alcohol before and after taking covid vaccine

కోవిడ్ వ్యాక్సిన్‌కు ముందు లేదా త‌రువాత ఎప్పుడైనా స‌రే ఆల్క‌హాల్‌ను సేవిస్తే దాని ప్ర‌భావం టీకాపై ఉండ‌దు. ఆల్క‌హాల్ ప్ర‌భావం యాంటీ బాడీల ఉత్ప‌త్తిపై ప‌డ‌దు. క‌నుక ఈ విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌తోపాటు అమెరికాకు చెందిన సీడీసీ కూడా వెల్ల‌డించింది. వ్యాక్సిన్ల‌పై ఆల్క‌హాల్ ఎలాంటి ప్ర‌భావం చూపించ‌ద‌ని తేల్చారు.

ఇక కోవిడ్ టీకాల‌పై ఆల్క‌హాల్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంద‌నే విష‌యాన్ని త‌యారీ సంస్థ‌లే వెల్ల‌డించ‌లేదు. సాధారణంగా ఇంగ్లిష్ మందుల‌ను వాడేట‌ప్పుడు ఆల్క‌హాల్‌ను సేవించ‌కూడ‌ద‌ని, లేదంటే రియాక్ష‌న్లు వ‌స్తాయ‌ని చెబుతారు. కానీ కోవిడ్ టీకాల విష‌యంలో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సంస్థ‌లు కూడా ఎలాంటి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. మ‌రోవైపు యూకేకు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడ‌క్ట్స్ రెగ్యులేట‌రీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) కూడా కోవిడ్ టీకాల‌పై ఆల్క‌హాల్ ప్రభావం చూపించ‌ద‌నే చెప్పింది. క‌నుక ఈ విష‌యంలో ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన పనిలేద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment