OTT : ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న మూవీలు ఇవే..!

August 16, 2022 9:54 PM

OTT : వారం వారం మారుతున్న కొద్దీ ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్ష‌కులు కూడా ఓటీటీల‌కు బాగానే అల‌వాటు ప‌డ్డారు. దీంతో ఓటీటీ యాప్స్ వీలైనంత త్వ‌ర‌గా కొత్త సినిమాల‌ను రిలీజ్ చేసేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ప‌లు సినిమాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రౌడీ హీరో విజయ్ దేవ‌ర కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన చిత్రం.. హైవే. ఈ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. ఆహా ప్లాట్‌ఫామ్‌పై ఈ మూవీని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ నెల 19వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. మిస్ట‌రీ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ మూవీని తెర‌కెక్కించారు.

list of movies releasing on OTT apps on 19th August 2022
OTT

కొత్త సినిమాల‌ను విడుద‌లైన రోజే రిలీజ్ చేస్తున్న త‌మిళ రాక‌ర్స్ అనే సైట్ గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఇదే క‌థాంశం, ఇదే పేరుతో ఓ మూవీని తెర‌కెక్కించారు. త‌మిళ రాకర్జ్ పేరిట రూపొందిన ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. సోనీ లివ్ యాప్‌లో ఈ మూవీని ఈనెల 19వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. సినిమాల పైర‌సీ నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు.

విజ‌య్ ఆంటోని న‌టించిన యానాయ్ అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఈ మూవీని ఈ నెల 19వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు. జీ5 యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.

క‌న్న‌డ స్టార్స్ శివ రాజ్ కుమార్, ధ‌నంజ‌య‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన మూవీ.. బైరాగి. ఈ మూవీని ఈ నెల 19వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు. క‌న్న‌డ‌లో తెర‌కెక్కిన ఈ మూవీ వూట్ అనే యాప్‌లో స్ట్రీమ్ కానుంది. ఇలా ఈ వారం ప‌లు మూవీలు ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment