Karthikeya 2 : ఓటీటీలో కార్తికేయ 2 మూవీ.. ఎందులో, ఎప్పుడు.. అంటే..?

August 17, 2022 7:59 AM

Karthikeya 2 : టాలీవుడ్ లో గత రెండు వారాలుగా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. వరుసగా విడుదలవుతున్న చిత్రాలు హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతున్నాయి. ఇక ఇటీవల విడుదలైన మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2 సినిమాల్లో మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలవగా, కార్తికేయ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ ను సంపాదించుకుంది.

మొదటి రోజు కాస్త తక్కువగానే కలెక్షన్లు వ‌చ్చినా.. నాలుగ‌వరోజుకి స్క్రీన్ కౌంట్ మూడింతలయింది. కంటెంట్ ఉంటే.. కలెక్షన్లకు అడ్డేదీ ఉండదని ఈ సినిమా నిరూపించింది. తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లోనూ కార్తికేయ 2 భారీ వసూళ్లు రాబడుతోంది. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల విషయానికొస్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Karthikeya 2 movie digital rights grabbed by Zee5
Karthikeya 2

కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ జీ5తో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. అతని మూవీ ది కాశ్మీర్ ఫైల్స్ కూడా జీ5లోనే స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు అభిషేక్ తాజాగా కార్తికేయ 2 ను కూడా జీ5 కే అమ్మినట్టు తెలుస్తోంది. సినిమా విడుదలైన ఆరు వారాలకు ఓటీటీలో విడుదల కానుంది. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని జీ5 సంస్థ త్వరలోనే ప్రకటించనుంది. కార్తికేయ 2.. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంతో నిఖిల్ కి బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment