---Advertisement---

Aloe Vera Pack : ఈ పేస్ట్‌ను జుట్టుకు త‌ర‌చూ రాస్తుంటే.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..

August 15, 2022 11:41 AM
---Advertisement---

Aloe Vera Pack : ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య చిన్నా పెద్ద తేడా లేకుండా అంద‌రిలోనూ వ‌స్తోంది. ప‌ర్యావ‌ర‌ణంలో పెరుగుతున్న కాలుష్యం కార‌ణంగా మనం ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. కాలుష్యం వలన జుట్టు పొడిబారడం, చిట్లి పోవడం, జుట్టు అధికంగా ఊడిపోవడం వంటి సమస్యల‌ను ఎదుర్కొంటున్నాము. జుట్టు ఊడిపోతుందనే ఒత్తిడిలో మన తాహతుకు మించి ఖరీదైన షాంపూలు, నూనెల‌ను ఎక్కువగా వినియోగిస్తున్నాం.

దీనివల్ల‌ ధనం, కాలం రెండు వృథా చేసుకుంటున్నాం. మనకు ప్రకృతి ఎన్నో సదుపాయాల‌ను కల్పించింది. అందులో కలబంద కూడా ఒకటి. కలబందలో ఉండే మినరల్స్, ఎంజైమ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు మంచి పోషకాలను అందజేసి ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. కొంత సమయాన్ని వెచ్చించడం ద్వారా కలబందతో మన జుట్టుని ఒత్తుగా, దృఢంగా మార్చుకోవచ్చు.

use this Aloe Vera Pack for hair growth
Aloe Vera Pack

మనం జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి కలబందతో తయారు చేసే ఆ రెమిడీ ఏంటో చూద్దాం. ఒక బౌల్ లో 3 మూడు టీస్పూన్ల కలబంద గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం, రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనె, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. తయారుచేసుకున్న ఈ ప్యాక్ ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ జుట్టు మొత్తం పట్టే విధంగా అప్లై చేసుకోవాలి.

అల్లంలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, ఖనిజాలు జుట్టు కుదుళ్ల‌ను దృఢంగా మారుస్తాయి. ఒక గంట వరకు తలకు పట్టించిన ఈ ప్యాక్ ను ఆరనిచ్చి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. ఇలా ఈ రెమిడీని వారానికి రెండుసార్లు  ఉపయోగించడం ద్వారా జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతే కాకుండా అధిక చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now